తండ్రి హితబోధ..కాజల్ డ్రాప్ అయిందట!

0

టాలీవుడ్ లో చాలామంది హీరోయిన్లే ఉన్నా కాజల్ కు మాత్రం డబ్బు వ్యవహారాల్లో దిట్ట అనే పేరుంది. ఎక్కువ రెమ్యూనరేషన్ ఎలా రాబట్టాలి.. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ బ్రాండ్ ప్రమోషన్స్.. షో రూమ్ ఓపెనింగ్స్ చేస్తూ నాలుగురాళ్ళు ఎలా వెనకేసుకోవాలి అనే విషయం కాజల్ కు తెలిసినంతగా ఎవరికీ తెలియయదని టాక్ ఉంది. అయితే ఇలాంటి డబ్బులెక్కలు తెలిసిన భామామణి నిర్మాత అవతారం ఎత్తుతుందని వార్తలు రావడంతో చాలామంది ఆశ్చర్యపోయారు.

కానీ లేటెస్ట్ టాక్ ఏంటంటే కాజల్ ప్రొడ్యూసర్ గా మారే ఆలోచనను పక్కన పెట్టేసిందట. కాజల్ మొదట ప్రశాంత్ వర్మ ‘అ!’ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని ప్లాన్ చేసుకుందట. కానీ ఆ ఆలోచనను విరమించుకుంది. ‘అ!’ రీమేక్ ను డ్రాప్ చేసుకున్న తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కే నెక్స్ట్ సినిమాను నిర్మించాలనే ప్లాన్ చేసిందట. ‘కల్కి’ తర్వాత ప్రశాంత్ డైరెక్ట్ చేయబోయే ఈ సినిమాను ‘పెళ్ళిచూపులు’ నిర్మాత రాజ్ కందుకూరి తో కలిసి సంయుక్తంగా నిర్మించాలనే ప్లాన్ చేసిందట. కానీ ఆ ప్లాన్ ను కూడా ఇప్పుడు అటకెక్కించిందట. ఈ సినిమానే కాదు అసలు నిర్మాతగా మారాలనే ఆలోచనకే చరమగీతం పాడిందట.

దీనికి కారణం.. కాజల్ తండ్రిగారు వినయ్ అగర్వాల్ అని సమాచారం. నిర్మాత అంటే బాధ్యత పెరుగుతుందని.. రిస్క్ ఎక్కువగా ఉంటుందని ఆయన సూచించారట. సినిమాలో జస్ట్ నటిస్తే నీ రెమ్యూనరేషన్ కు ఢోకా ఉండదు. సినిమా షూటింగ్ పూర్తి కాగానే నీ పని అయిపోతుంది.. హాయిగా మరో సినిమా సంగతి చూసుకోవచ్చు.. లేనిపోని తలనొప్పులు ఎందుకు అని హితబోధ చేశారట. దీంతో తండ్రిగారు ఇచ్చిన సలహా మేరకు ప్రొడక్షన్ ప్లాన్స్ పక్కన పెట్టేసిందట. పాపే అనుకుంటే పాపా తెలివితేటలు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయిగా!
Please Read Disclaimer