జలకాలాటలలో చందమామ

0

చందమామ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఈమద్య కాలంలో కాస్త స్లో అయ్యింది. పదేళ్ల పాటు ఈ అమ్మడు టాలీవుడ్ కోలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా చిత్రాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా దూసుకు పోయింది. ఈ మద్య కాలం లో ఈ అమ్మడి జోరు కాస్త తగ్గింది. ప్రస్తుతం ఈమె ఇండియన్ 2 మినహా మరే సినిమాలో కూడా నటిస్తున్నట్లుగా అనిపించడం లేదు. కొన్ని సినిమాలు చర్చలు జరుగుతున్నా కూడా అవి ఓకే అవ్వడం లేదు.

ఈమె పారితోషికం అధికంగా డిమాండ్ చేస్తున్న కారణంగా ఈమె వద్దకు చిన్న నిర్మాతలు వెళ్లేందుకు భయపడుతున్నారు అనే టాక్ కూడా ఉంది. ఇలాంటి సమయం లో ఈ అమ్మడు ఎక్కువ ఖాళీ టైం దొరుకుతున్న కారణంగా కుటుంబ సభ్యుల తో టైంను ఎంజాయ్ చేస్తుంది. ఈమద్య ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యింది. ఈమె ఫొటోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఈ ఫొటోలు నెటిజన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. నీటితో ఆడుకుంటూ కాజల్ ఫొటోకు స్టిల్ ఇచ్చింది. పర్ఫెక్ట్ క్లిక్ అంటూ నెటిజన్స్ ఈ ఫొటోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాజల్ ఇంకా పదేళ్లు హీరోయిన్ గా కొనసాగేంత సత్తా మరియు అందం ఉన్న హీరోయిన్ అంటూ ఈ ఫొటోకు ఆమె అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. హీరోయిన్ గా సినిమాల తో రాకున్నా కాజల్ ఇలా ఫొటోలతో ప్రేక్షకులకు ఎప్పుడు దగ్గరే ఉంటుంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-