హనీమూన్ హింట్ ఇచ్చిన చందమామ

0

కరోనా టైమ్ లో పెళ్లి చేసుకుంటున్న చాలా మంది హనీమూన్ ను మిస్ అవుతున్నాం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అయితే హనీమూన్ కు వీలు పడటం లేదు అంటూ పెళ్లిని వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నారట. ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకున్న కాజల్ గౌతమ్ లు హానీమూన్ కు వెళ్తున్నారా లేదా అంటూ ఒక వర్గం నెటిజన్స్ తెగ చర్చించుకుంటున్నారు. ఆ విషయం పెద్ద ముఖ్యమైనదే కాకున్నా కూడా చాలా మంది ఆ విషయంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ సోషల్ మీడియా ద్వారా కాజల్ ను మీ హనీ మూన్ ప్లాన్స్ ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇలాంటి సమయంలో విదేశాలకు వెళ్లడం చాలా ప్రమాదకరం అన్నట్లుగా ఉంది. అందుకే కాజల్ దంపతులు హనీ మూన్ కు వెళ్లే అవకాశం లేదు అంటూ అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా కాజల్ స్వయంగా హనీమూన్ కు రెడీ అవుతున్నట్లుగా హింట్ ఇచ్చింది. బ్యాగ్స్ సర్దేశాం రెడీ టు ప్లై అన్నట్లుగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె పోస్ట్ అర్థం ఖచ్చితంగా హనీమూన్ అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరో రెండు రోజుల్లో ఆచార్య షూటింగ్ పునః ప్రారంభం కాబోతుంది. ఆ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు ఆమె హైదరాబాద్ రాబోతుంది అని కూడా కొందరు అంచనా వేస్తున్నారు. అసలు విషయం ఏంటీ అనేది ఆమె మరో పోస్ట్ తో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.