మూడు రోజులుగా ఆల్కహాల్ ఎక్కువ అవుతోంది : కాజల్

0

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సినిమాలు చేతిలో ఎక్కువగా లేకపోవడం తో సోషల్ మీడియా మీదా పడ్డట్లుగా ఉంది. ఈమె వరుసగా ఫొటో షూట్స్ తో రెచ్చి పోవడంతో పాటు సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ ను పెడుతూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు గత మూడు రోజులుగా నా చేతులు ఆల్కహాల్ ను ఎక్కువగా తీసుకుంటున్నాయి. నా లివర్ కు ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అంటూ ఫన్నీగా కామెంట్స్ చేసింది.

కరోనా భయం వల్ల ప్రతి గంటకు ఒకసారి రెండు గంటలకు ఒకసారి శానిటైజర్స్ తో చేతులు కడుక్కోవడం చేయాలంటూ ముందస్తు జాగ్రత్తలను ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో కాజల్ అగర్వాల్ పదే పదే చేతులను శానిటైజర్స్ తో కడుక్కుందట. శానిటైజర్స్ లో ఆల్కహాల్ ఉంటుంది. అందువల్లే కాజల్ కాస్త ఫన్నీగా ఇలాంటి పోస్ట్ పెట్టింది.

ప్రస్తుతం ఈ అమ్మడు భారతీయుడు సినిమా మినహా మరే సినిమాలో కూడా నటించడం లేదు. ఈమె వద్దకు వెళ్లిన ఇద్దరు ముగ్గురు చిన్న నిర్మాతలను భారీ పారితోషికం డిమాండ్ చేసి బెదరగొట్టిందట. తమిళంలో ఒక సినిమా చర్చల దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇండియన్ 2 విడుదల అయితే మళ్లీ బిజీ అవుతాను అంటూ ఈ అమ్మడు నమ్మకంగా ఉంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-