కాజల్ కు పది మిలియన్లు.. సౌత్ లోనే టాప్!

0

ఈ సోషల్ మీడియా జెనరేషన్ లో ఒక సెలబ్రిటీ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో తెలియాలంటే సోషల్ మీడియాఖాతాల ఫాలోయర్ల సంఖ్య చూస్తే సరిపోతుంది. ట్విట్టర్ ఫాలోయర్లు..ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్ల సంఖ్య చూసి అది అభిమానులకు కొలమానం కాదని కొందరు మూతి తిప్పుకోవచ్చు కానీ అది అభిమానాన్ని తెలుసుకునే పెరామీటర్స్ లో ఒకటి అని మాత్రం ఒప్పుకోవాల్సిందే.

ఈ విషయంలో టాలీవుడ్ బ్యూటీలలో అందరికంటే ముందే ఉన్నది చక్కనైన చందమామ కాజల్ అగర్వాల్. సమంతా లాంటి స్టార్ హీరోయిన్.. రకుల్ లాంటి క్రేజీ హీరోయిన్లు కూడా కాజల్ తో పోలిస్తే సోషల్ మీడియా ఫాలోయర్స్ విషయంలో వెనకబడి ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ విషయమే తీసుకుంటే కాజల్ ఇప్పుడు ఒక సూపర్ రికార్డ్ నెలకొల్పింది. టాలీవుడ్ హీరోయిన్లలో మొదటి సారి గా 10 మిలియన్ ఫాలోయర్ల ను సాధించింది కాజల్ మాత్రమేనని సమాచారం. ఒక్క టాలీవుడ్డే కాదు.. మొత్తం సౌత్ లో ఏ హీరోయిన్ కు ఇన్స్టాగ్రామ్ లో ఈ రేంజ్ ఫాలోయింగ్ లేదట. అందుకే కాజల్ ఇన్స్టాగ్రామ్ క్వీన్ అనని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

కాజల్ తర్వాత రెండో స్థానంలో రకుల్ ప్రీత్ ఉందట. రకుల్ కు 7.3 మిలియన్ల ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్లు ఉన్నారు. ఇక సమంతా కు 6.5 మిలియన్ల ఫాలోయర్లు మాత్రమే ఉన్నారు. ఈ మధ్య క్రేజీ హీరోయిన్ గా మారిన రష్మిక మందన్న మాత్రం ఈ ముగ్గురికి దరిదాపులలోనే లేదట. కాజల్ 10 మిలియన్ మార్క్ సాధించిన సందర్భంగా “10 మిలియన్ ఇన్స్టా కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. మీ ప్రేమ.. మీ మద్దతే నా ప్రపంచం. అందరికీ మిలియన్ల కిస్సులు” అంటూ మెసేజ్ పెట్టింది.
Please Read Disclaimer