సినిమాటిగ్గా ఉన్నా రొమాంటిక్ గా..!

0

ఇటీవలి కాలంలో చందమామ కాజల్ పెళ్లికి వచ్చినంత పబ్లిసిటీ బహుశా ఇక వేరే ఏ సెలబ్రిటీ పెళ్లికి రాలేదేమో. ఉన్నట్టుండి సడెన్ గా బిజినెస్ మేన్ తో ప్రేమాయణం అంటూ అసలు విషయం బయటపడిపోవడంతో అభిమానులంతా ఒకటే ఆసక్తిగా కాజల్ గురించి గూగుల్ సెర్చ్ స్టార్ట్ చేశారు. ఎవరా పెళ్లి కొడుకు.. ఉన్నట్టుండి బయటపడ్డాడు? అంటూ ఆరాలు ఎక్కువయ్యాయి.

ఇక పెళ్లాడేస్తున్నా అని కాజల్ ప్రకటించిన మరుక్షణం నుంచి తన ప్రియుడు గౌతమ్ కిచ్లు ఫోటోలు అంతర్జాలాన్ని షేక్ చేశాయి. ఆ ఇద్దరూ జంటగా ఉన్నవి సోషల్ మీడియాల్లో వైరల్ గా మారాయి.

కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లుతో ప్రేమాయణం ఎంతో గుట్టుగా సాగడంతో ఏదీ బయటికి తెలియలేదు. ఇంతలోనే రిలేషన్ షిప్ గురించి ప్రకటించేయడం.. ఆ వెంటనే పెళ్లాడేయడంతో ఇప్పటికి అందరికీ ప్రతిదీ బోధపడిందని చెప్పాలి. అక్టోబర్ 30 న గౌతమ్ ని కాజల్ అగర్వాల్ పెళ్లాడేసింది. ఈ జంట పెళ్లి ముచ్చటకు సంబంధించిన చాలా ఫోటోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. తాజాగా కాజల్ సోషల్ మీడియాలో ఓ అరుదైన ఫోటోను షేర్ చేసారు.

కాజల్ -గౌతమ్ ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ లో హాటెస్ట్ జంటగా పాపులరయ్యారు. తాజాగా రివీల్ చేసిన ఫోటోలోనూ మరింతగా వేడెక్కించే కెమిస్ట్రీతో కనిపించారు. ఇప్పటికే లక్షలాది మంది ఈ ఫోటోకి లైక్ లు కొట్టారు. ఇండస్ట్రీ సెలబ్రిటీలు సహా పలువురు అగ్రశ్రేణి ప్రముఖులు కూడా ఈ ఫోటోకి లైక్ లు కొట్టారు. చందమామతో కిచ్లు రొమాన్స్ అదిరింది అంటూ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.