వారం దాటినా ట్రెండింగ్ లోనే కాజల్ దంపతులు

0

కాజల్ పెళ్లి అయ్యి వారం దాటింది. పెళ్లికి మూడు నాలుగు రోజుల ముందు నుండే సందడి ప్రారంభం అయ్యింది. పెళ్లికి తక్కువ మంది గెస్ట్ లను ఆహ్వానించినా కూడా పెళ్లి వేడుకల్లో మాత్రం మార్పు రాకుండా కాజల్ అన్ని కార్యక్రమాలు జరిగేలా చూసింది. మెహెందీతో పాటు సంగీత్ పెళ్లి కూతురు చేయడం ఇలా అన్ని కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. మూడు రోజుల ముందు నుండే ప్రారంభం అయిన కాజల్ గౌతమ్ ల వివాహ సందడి పెళ్లి పూర్తి అయిన మూడు రోజుల వరకు కొనసాగింది. పెళ్లి తర్వాత నూతన గృహ ప్రవేశం చేసిన కాజల్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సౌత్ తో పాటు ఉత్తరాదిన కూడా మంచి గుర్తింపు ఉన్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కూడా సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఆ కారణం వల్ల కాజల్ పెళ్లి సందడి సోషల్ మీడియాలో గత పది రోజులుగా కనిపిస్తూనే ఉంది. ఫేస్ బుక్.. ఇన్ స్టా.. ట్విట్టర్ ఇలా ఎక్కడ చూసినా కూడా కాజల్ గౌతమ్ ల ఫొటోలు మరియు వీడియోలు కనిపిస్తున్నాయి. పెళ్లి తర్వాత రొమాంటిక్ ఫొటో షూట్ లో పాల్గొన్న దంపతులకు సంబంధించిన ఫొటోలు మరియు వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి కాజల్ దంపతులు ట్రెడీషనల్ డ్రస్ ల్లో ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత కూడా ఇన్ని రోజులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్న జంట ఇదే అంటూ కాజల్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.