అప్పుడే సిస్టర్ పాత్రలకు దిగిపోతే!

0

సిస్టర్ పాత్రలో నటించడం అంటే అదో సవాల్ లాంటిదే. అక్క.. చెల్లి అనే ఇమేజ్ పడిపోతే ఆ తర్వాత కథానాయికగా అవకాశాలు కష్టమేనని భామలంతా భయపడుతుంటారు. స్టార్ డమ్ .. ఇమేజ్ ఉన్నప్పుడు అలాంటి ప్రయోగాల జోలికి వెళ్లరు. అక్క చెల్లి పాత్రలు చేయాలంటే ఎంతో ఆచితూచి వ్యవహరిస్తారు. ఇక కథానాయికగా అవకాశాలు రావు అనుకుంటేనే ఆ తరహా పాత్రలు అంగీకరించే పరిస్థితి ఉంటుంది. అలా ఇటీవలి కాలంలో ఫేడవుట్ హీరోయిన్లు అమ్మ.. అక్క పాత్రలకు ఓకే చెబుతున్న వైనం చూస్తూనే ఉన్నాం.

అయితే అలాంటి సన్నివేశం కాదు కానీ.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ ఒక హీరోకి చెల్లి పాత్రలో నటించేందుకు అంగీకరించడంపై సర్వత్రా ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. అది కూడా మంచు విష్ణు నటిస్తున్న హాలీవుడ్ చిత్రంలో కాజల్ సిస్టర్ రోల్ పోషిస్తోందట. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తాజా సమాచారం రివీలైంది. ఇదో గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్. ఇందులో అన్నాచెల్లెళ్ల పాత్రలు ఎంతో కీలకంగా ఉంటాయట. అందుకే కాజల్ ఈ సినిమాలో సిస్టర్ గా నటించేందుకు అంగీకరించిందని తెలుస్తోంది.

హ్యాపీ రాఖీ అర్జున్! అంటూ ఆన్ లొకేషన్ ఉండగా.. మంచు విష్ణుకు రాఖీ కట్టిన ఫోటోని కాజల్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం.. దానికి థాంక్యూ అనూ! అంటూ అతడు రిప్లయ్ ఇవ్వడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఇక అన్నాచెల్లెళ్ల పాత్రలు అనగానే రక్తసంబంధం చిత్రంలో ఎన్టీఆర్- సావిత్రి.. అర్జున్ చిత్రంలో మహేష్- కీర్తి రెడ్డి గుర్తుకు వస్తారు. అలా చాలా సినిమాల్లో హీరోకి చెల్లెలు పాత్రల్లో కథానాయికలు నటించిన సందర్భాలున్నాయి. అయితే సిస్టర్ పాత్ర చేశాక .. నిర్మాతలు కథానాయికగా అవకాశాలు ఇవ్వలేం అని నిర్ణయించుకుంటేనే చిక్కులొస్తాయన్నమాట.
Please Read Disclaimer