కన్నడ లో కాజల్ కొత్త ప్రయాణం

0

అందాల చందమామ కాజల్ అగర్వాల్ కెరీర్ జర్నీ గురించి తెలిసిందే. టాలీవుడ్ -కోలీవుడ్ లో అగ్ర హీరోలందరి సరసన నటించేసింది. ప్రస్తుతం విశ్వ నటుడు కమల్ హాసన సరసన ఇండియన్-2 లో నటిస్తోంది. అయితే సౌత్ లో కన్నడ-మలయాళ రంగాలతో కాజల్ కి అస్సలు టచ్ లేదు. అందుకే ఇకపై ఈ రెండు భాషల్లోనూ నటించాలని డిసైడైందట.

ఈ ప్రయత్నం లో భాగంగానే తొలిగా కన్నడ భాష పై దృష్టి సారించిందని తెలుస్తోంది. కన్నడ- తెలుగు రంగాల్లో ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న ఉపేంద్ర సరసన ఛాన్స్ అందుకుంది. కబ్జా అనేది టైటిల్. ఇది కూడా ఉపేంద్ర శైలిలో రా అండ్ రస్టిక్ కంటెంట్ ఉన్న సినిమా. కాజల్ కి కూడా ఉప్పీ నుంచి టార్చర్ తప్పదట. అతడు నటించిన ఏ.. ఉపేంద్ర లాంటి చిత్రాల్లానే కొంచెం హార్డ్ గానే ఉంటుందట. అయినా ఉపేంద్ర సరసన అవకాశాన్ని కాదన లేకపోయిందట.

అయితే నయనతార- త్రిష లాంటి భామలు కన్నడ లో సత్తా చాటాలని ప్రయత్నించి విఫలమయ్యారు. ఇప్పటికీ అడపదడపా సినిమాలు చేస్తున్నా.. స్పీడ్ చూపించ లేకపోతున్నారు. ఆ ఇద్దరి బాటలోనే వెళుతున్న కాజల్ అక్కడ సక్సెస్ అవుతుందా? అన్నది చూడాలి. కాజల్ ఇప్పటికే కెరీర్ లో 50 చిత్రాలు పూర్తి చేసింది. హీరోయిన్ గా సెంచరీ కొడతానన్న ధీమాని వ్యక్తం చేస్తోంది. అయితే తెలుగు-తమిళం లో జోరు తగ్గింది కాబట్టి ఇరుగు పొరుగు సినిమాలతో అంత స్పీడ్ చూపించగలదా? అన్నదే సందేహం. కాజల్ నటిస్తున్న మోసగాళ్లు చిత్రం త్వరలో రిలీజ్ కి రానుంది.
Please Read Disclaimer