భర్తే నిర్మాత.. అయినా నటీమణికి రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందేనా!

0

బాలీవుడ్ లో చూడచక్కని కపుల్స్ లో అజయ్ దేవగణ్- కాజోల్ ఉంటారు. వివాహం చేసుకున్న హీరో హీరోయిన్లలో ఈ జంట కూడా ఒకటి. వివాహం తర్వాత కూడా కాజల్ ను ఎంచక్కా సినిమాలు చేయనిస్తున్నాడు అజయ్ దేవగణ్. ఆ రకంగా ఆదర్శ భర్తగా నిలుస్తూ ఉన్నాడు. మరోవైపు తను హీరోగా కొనసాగుతూ అప్పుడప్పుడు సొంత ప్రొడక్షన్ లో సినిమాలు కూడా చేస్తున్నాడు అజయ్ దేవగణ్. ఈ క్రమంలో ఆయన హోం ప్రొడక్షన్లో మరో సినిమా వస్తోంది. అదే *తన్హాజీ*.

ఈ సినిమాలో అజయ్ దేవగణ్ టైటిల్ రోల్ చేస్తున్నాడు. ఇది పద్దెనిమిదో శతాబ్దానికి చెందిన కథ. అప్పటి వారియర్ అయిన తన్హాజీ జీవితాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. విశేషం ఏమిటంటే.. ఇందులో అజయ్ కు జంటగా కాజోల్ నటిస్తూ ఉంది. భార్యాభర్తలు కలిసి నటిస్తున్నారు. వారిద్దరూ చేస్తున్నది కూడా భార్యాభర్తల పాత్రలనే. తన్హాజీ పాత్ర సావిత్రి భాయ్ పాత్రను కాజోల్ చేస్తూ ఉంది.

ఇలాంటి నేపథ్యంలో ఒక సరదా రూమర్ ను కాజోల్ వద్దే ప్రస్తావించింది మీడియా. తొలి సారి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలో నటిస్తున్నారు..అది కూడా ఆ పాత్ర బాగా నచ్చి.. ఫ్రీ గాచేస్తున్నారట కదా.. అని మీడియా కాజోల్ వద్ద సరదాగా ఆరా తీసింది. అయితే.. అలాంటిదేమీ లేదన్నట్టుగా కాజోల్ స్పందించింది!

ఆ పాత్ర ఎంతో నచ్చినప్పటికీ ఆ సినిమాలో తన భర్తకు జోడీగా నటిస్తున్నప్పటికీ ఆ సినిమాకు నిర్మాత తన భర్తే అయినప్పటికీ.. రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం కాజోల్ రాజీ పడలేదట. సరదాగా మాత్రమే అజయ్ దేవగణ్ అలా అడిగాడని భర్తే నిర్మాత అయిన రెమ్యూనరేషన్ రొటీనే అని కాజోల్ ఇన్ డైరెక్టుగా కుండబద్ధలు కొట్టేసింది!
Please Read Disclaimer