సైలెంట్ గా మంచివాడు సర్ ప్రైజ్ ఇస్తాడా?

0

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎంత మంచివాడవురా’. గుజారాతి సూపర్ హిట్ ఫిలిం ‘ఆక్సిజెన్’ కు రీమేక్ అయిన ఈ సినిమా కంటెంట్ స్ట్రాంగ్ గా ఉందని ఈసారి కళ్యాణ్ రామ్ కు విజయం దక్కడం ఖాయమని టీమ్ చాలా నమ్మకంగా ఉంది. అయితే ఈ సినిమా విజయానికి కళ్యాణ్ రామ్ పెర్ఫార్మెన్స్ కీలకంగా నిలవనుందట.

రీమేక్ సినిమా అయినప్పటికీ తెలుగు నేటివిటీకి తగ్గట్టు సతీష్ వేగేశ్న మార్పుచేర్పులు చేశారట. స్క్రిప్ట్ పరంగా ‘ఎంత మంచివాడవురా’ చాలా బలంగా ఉందని టాక్ ఉంది. అయితే ఇది ప్రేక్షకులకు కనెక్ట్ కావాలంటే మాత్రం కళ్యాణ్ రామ్ అద్భుత నటన ప్రదర్శించాల్సి ఉంటుందని అంటున్నారు. నిజానికి ఇలాంటి సినిమాలకు స్ట్రాంగ్ పెర్ఫార్మర్స్ అయిన శర్వానంద్ లాంటి వారు కరెక్ట్ గా సూట్ అవుతారని.. మరి కళ్యాణ్ రామ్ ఈ కథకు న్యాయం చేయగలడా లేదా అనేది చూడాలని అంటున్నారు. కళ్యాణ్ రామ్ నటన పైనే ఈ సినిమా విజయం సాధించేది లేనిదీ ఆధారపడి ఉంటుందని.. ఒక వేళ అదే జరిగితే కళ్యాణ్ రామ్ తన కెరీర్లో నటుడిగా ఒక మెట్టు పైకెక్కినట్టేనని అంటున్నారు.

అయితే విడుదలకు వారం రోజులే ఉన్నప్పటికీ సినిమాపై ఇప్పటివరకూ పెద్దగా హైప్ లేదు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమాకు మంచి బజ్ వస్తుందనే అంచనాలు ఉన్నాయి. మరి సైలెంట్ గా వస్తున్న ఈ సినిమా సంక్రాంతి సర్ ప్రైజ్ ఇస్తుందేమో వేచి చూడాలి.
Please Read Disclaimer