ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ లతో మల్టీస్టారర్ చేయనని.. బాలయ్య అందుకే నో చెప్పాడా..?

0

ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల హవా మాములుగా లేదు. చిన్న హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకు అందరూ ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలో పరభాష సూపర్ హిట్ మల్టీస్టారర్ లను కూడా మనవాళ్ళు వదలడం లేదు. ఇటీవలే మలయాళం సూపర్ హిట్ ‘అయ్యప్పన్ కోషియం’ తెలుగు హక్కులు దక్కించుకున్న విషయం తెలిసిందే. దగ్గుబాటి హీరోలు ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు. ఇక అక్కినేని ఫ్యామిలీ ఇదివరకే మూడు తరాల నటులు నటించేసారు. కానీ ఇంకా నందమూరి ఫ్యామిలీనుండి ఎలాంటి మల్టీస్టారర్ రాలేదని అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య బాలకృష్ణతో కళ్యాణ్ రామ్ మహనాయకుడిలో కనిపించినప్పటికి అసలైన జూనియర్ ఎన్టీఆర్ నటించకపోవడం ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. పైగా ఆ సినిమా కూడా అట్టర్ ప్లాప్ అవ్వడం మరో నిరాశ చెందించిన విషయం.

ఇదిలా ఉండగా ప్రస్తుతం నందమూరి మల్టీస్టారర్ కోసం కళ్యాణ్ రామ్ రెండు కథలను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. గత ఏడాది నుంచే కళ్యాణ్ రామ్ కథలను వినే పనిలో పడ్డాడట. అందులో ఒక కథ పై ఎన్టీఆర్ పాజిటివ్ గా స్పందించి సరైన దర్శకుడు దొరికితే చేద్దామని చెప్పాడట. కానీ బాలకృష్ణ మాత్రం అందుకు ఒప్పుకోలేదని తెలుస్తుంది. కథ నచ్చలేదో మరి సినిమా చేయడం ఇష్టం లేదో.. మరి బాలయ్య చేయనని డైరెక్ట్ నో చెప్పేసినట్లు టాక్. ఇక మించిపోయింది ఏమిలేదని ఎన్టీఆర్ అలోచించి.. బాలయ్య బాబాయ్ మెచ్చే కథ దొరికే వరకు వెయిట్ చేద్దామని కళ్యాణ్ రామ్ కు చెప్పి ఊరుకున్నట్లు చెప్తున్నాయి సినీ వర్గాలు. ప్రస్తుతం ఈ నందమూరి మల్టీస్టారర్ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. మరి అసలు సంగతి తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే..!
Please Read Disclaimer