ఆదిత్య 369 సీక్వెల్లో కళ్యాణ్ రామ్

0

బాలకృష్ణ కథానాయకుడి గా లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం లో `ఆదిత్య 369` తెరకెక్కిన సంగతి తెలిసిందే. బాలయ్య బాబు కెరీర్ లో మరపు రాని క్లాసిక్ చిత్రమిది. ఈ సినిమా కి సీక్వెల్ తెరకెక్కనుందని నాలుగైదేళ్లుగా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్ నేపథ్యం లో రిస్క్ తీసుకో లేక ఆలస్యం చేస్తున్నారని ప్రచారమైంది. కానీ ఏదో ఒకరోజు ఈ సీక్వెల్ ఆదిత్య 999 పేరుతో సెట్స్ పైకి వెళ్లడం మాత్రం ఖాయమని నందమూరి అభిమానులు భావిస్తున్నారు.

తాజాగా ఈ సీక్వెల్ కి సంబంధించిన ఒక ఆసక్తి కర రూమర్ హీటెక్కిస్తోంది. ఆదిత్య 999 లో బాబాయ్ కాకుండా అబ్బాయ్ కళ్యాణ్ రామ్ పేరు తెర పైకి వచ్చింది. టైమ్ మెషీన్ నేపథ్యం లో తెరకెక్కించే ఓ సినిమా లో కళ్యాణ్ రామ్ నటించబోతున్నారు అంటూ ఓ వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. దీంతో అది ఆదిత్య 369 సీక్వెల్ అన్న ఊహాగానాలు ఫ్యాన్స్ లో సాగుతున్నాయి.

భూత- భవిష్యత్- వర్తమాన కాలాలను ఆధారంగా చేసుకుని టైమ్ మెషీన్ బ్యాక్ డ్రాప్ లో కళ్యాణ్ రామ్ కోసం ఓ స్క్రిప్టు రెడీ అయ్యింది. ఐదు దశాబ్ధాల ముందు అంటే 1950 సమయం లో నడిచే స్టోరీ ఇదని సమాచారం. ఈ చిత్రాని కి వేణు మల్లిడి దర్శకత్వం వహించనున్నాడట. ఈ నేపథ్యం లో బాబాయ్ చేయాల్సిన కథలోనే అబ్బాయి నటిస్తున్నాడా? లేక ఆ కథను మాత్రమే పొలిన కథనా? అన్న గందరగోళం నెలకొంది. పైగా సింగీతం స్థానం లో కొత్త దర్శకుడి పేరు తెర పైకి రావడం ఆశ్చర్యంగానే అనిపిస్తోంది.

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సతీష్ వేగ్నేశ దర్శకత్వం లో `ఎంతమంచి వాడవురా` అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నారు. జనవరిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. అనంతరం కళ్యాణ్ రామ్ తదుపరి ప్రాజెక్ట్ పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇక బాలయ్య నుంచి ఆదిత్య 369 సీక్వెల్ పై స్పష్టమైన క్లారిటీ లేదు. ప్రస్తుతం కె.ఎస్ రవికుమార్ దర్శకత్వం లో రూలర్ లో నటిస్తున్నారు. ఈ సినిమా అనంతరం బోయపాటి శ్రీను దర్శకత్వం లో మరో సినిమా చేయనున్నారు. ఇంత బిజీ షెడ్యూల్ నడుమ బాలయ్య ఆదిత్య 396 సీక్వెల్ పై దృష్టి పెట్టే అవకాశం లేదనే కొందరు భావిస్తున్నారు.
Please Read Disclaimer