కళ్యాణ్ రామ్ చేతికి తారక్ క్రేజీ ప్రాజెక్ట్ ?

0

ఇటు హీరోగా అటు నిర్మాతగా డ్యూయల్ రోల్ చేస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ ఈ ఏడాది 118 రూపంలో సేఫ్ సక్సెస్ అందుకున్నాడు. నిర్మాణంలో ఉన్న ఎంత మంచివాడవవురా మీద కూడా ప్రీ పాజిటివ్ బజ్ చాలా ఉంది. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై తరచుగా స్వంతంగా సినిమాలు తీసే కళ్యాణ్ రామ్ తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ తో జై లవకుశ తీశాక కొంత బ్రేక్ తీసుకున్నాడు. ఇప్పుడు మరోసారి నిర్మాణం దిశగా ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న తారక్ ఇంకో ఆరేడు నెలల్లో ఫ్రీ అయిపోతాడు. ఆ తర్వాత కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మైత్రి సంస్థ నిర్మించే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తాడని టాక్ ఉంది కానీ దానికి సంబంధించి ఇంకా అఫీషియల్ నోట్ రాలేదు. ఇప్పుడు దీంట్లో కళ్యాణ్ రామ్ ప్రమేయం ఉండబోతున్నట్టు ఫిలిం నగర్ టాక్. ఆర్ఆర్ఆర్ పూర్తయ్యాక ఓకే అయిన ఈ మూవీని తనకు ఇచ్చేయమని మైత్రికి కళ్యాణ్ రామ్ ప్రతిపాదన పంపాడట.

దానికి బదులుగా రెండు బ్యానర్లు కలిసి నిర్మించే దిశగా ఏదైనా ఆలోచన ఉంటే ఆవైపుగా చర్చిద్దామని బదులు చెప్పారట. నిజంగా ఈ ప్రపోజల్స్ జరిగాయో లేదో తెలియదు కానీ మొత్తానికి లీకైన న్యూస్ ని బట్టి చూస్తే పూర్తిగా కొట్టిపారేయడానికి లేదు. కెజిఎఫ్ దర్శకుడు యంగ్ టైగర్ కాంబినేషన్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బడ్జెట్ కూడా ఆ లెవెల్ లోనే పెట్టాలి. మరి దానికోసమేనా కళ్యాణ్ రామ్ ఇలా జాయింట్ వెంచర్ కు ఓకే చెప్తాడేమో చూడాలి. మైత్రి సైడ్ నుంచి దీనికి సంబంధించిన సమాచారం ఇప్పట్లో వచ్చే అవకాశం అయితే లేదు
Please Read Disclaimer