సిడ్ శ్రీరామ్ పై పంచులేసిన మ్యూజిక్ డైరెక్టర్!

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా ‘అల వైకుంఠపురములో’ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ సామజవరగమన మ్యూజిక్ లవర్స్ కు వెంటనే కనెక్ట్ అయిపోవడంతో హిట్ అయింది. యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ పాట పాడిన వారు యూత్ లో మంచి క్రేజ్ ఉన్న సింగర్ సిడ్ శ్రీరామ్. అతను తెలుగు వ్యక్తి కాకపోవడంతో కొన్ని పదాల ఉచ్ఛారణ సరిగా లేదు. సరిగ్గా ఈ విషయంపై మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్ పంచులు వేశారు.

కళ్యాణి మాలిక్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ పాట గురించి స్పందిస్తూ పరోక్షంగా సిడ్ పై విమర్శలు కురిపించారు. “ప్రస్తుతం నీ హవా సాగుతోంది కాబట్టి ఎలా పాడినా చెల్లుతుందని” అంటూనే “ఈ పాట లిరిక్స్ కు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను” అంటూ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ పోస్ట్ ను తర్వాత కళ్యాణి మాలిక్ డిలీట్ చేశారు. అయినా కళ్యాణి మాలిక్ అంత బాధ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన తెలుగు వారిలోనే చాలామందికి తెలుగు పదాలను సరిగా పలకడం రాదు. పైగా వారు పలికేదే కరెక్ట్ అనే భ్రమలో ఉంటారు.. ఇలాంటి పరిస్థితుల్లో పరభాషా సింగర్ పై విమర్శలుచేసి ఏం ఉపయోగం!

ఏదేమైనా ఈ వివాదాలతో సంబంధం లేకుండా పాట మాత్రం శ్రోతలను మెప్పిస్తోంది. సిడ్ ఉచ్చారణను మరీ సీరియస్ గా తీసుకోకుండా ఉంటే మాత్రం ఈ పాట సిడ్ సింగింగ్ కెరీర్ లో వన్ అఫ్ ది బెస్ట్ అని చెప్పవచ్చు. థమన్ కూడా తన మ్యూజిక్ తో మెలోడీ ప్రియులను మెప్పించాడు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home