గ్యాంగ్ స్టర్ వీక్ నెస్ లీక్ చేసిందే

0

వెర్సటైల్ స్టార్ శర్వానంద్ – కళ్యాణి ప్రియదర్శన్- కాజల్ నాయకానాయికలుగా నటించిన `రణరంగం` ఈనెల 15న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శర్వా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ పాత్ర సీక్రెట్స్ గురించి కథానాయిక కళ్యాణి ప్రియదర్శన్ లీక్ చేయడం ఆసక్తికరం.

అసలు మీ పాత్రలో ఉండే ప్రత్యేకత ఏమిటి? అన్న తెలుగు మీడియా ప్రశ్నకు స్పందించిన కళ్యాణి.. తన పాత్రకు శర్వా రోల్ తో ఉన్న కనెక్టివిటీని రివీల్ చేశారు. “రణరంగం మొత్తం సినిమా శర్వాపైనే నడుస్తుంది. కథానాయకుడి జీవితం.. అతడి గోల్ చుట్టూనే కథాంశం తిరుగుతుంది. నేను ఈ పాత్ర చేయడానికి కారణం .. నా పాత్ర గీత ద్వారానే అతడేంటో ప్రేక్షకులకు అర్థమవుతుంది. ఆ పాత్ర స్వభావం రివీలవుతుంది. ఇందులో శర్వా బలమైన ఇంటెన్స్ పాత్రలో నటించారు“ అని తెలిపారు. అంతేకాదు.. అమ్మాయిల విషయంలో మగాళ్లకు ఉండే వీక్ నెస్.. ప్రేమ వగైరా బయటపట్టే పాత్ర నాది.. అని కళ్యాణి తెలిపారు.

గ్యాంగ్ స్టర్స్ మీకు ఇష్టమా? అని ప్రశ్నిస్తే.. ఐ లవ్ గ్యాంగ్ స్టర్ మూవీస్ అంటూ సమాధానం ఇచ్చారు. నేను కిడ్ గా ఉన్నప్పుడు గ్యాంగ్ స్టర్ సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపించేదానిని. డాడీ(ప్రియదర్శన్)ని ఆ తరహా సినిమాల గురించి అడిగేదానిని అని తెలిపారు. మొత్తానికి కళ్యాణికి గ్యాంగ్ స్టర్లపై ఉన్న ప్రేమను తెలుగు మీడియా అలా లీక్ చేసింది. నన్ను ఎగ్జయిట్ చేసే ఏ పాత్రలో అయినా నేను చేస్తానని కళ్యాణి ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
Please Read Disclaimer