భారతీయుడు 2.0 రీలోడెడ్

0

1996 లో మన సమాజం ఎలా ఉండేది? నాటి కాలంలో అవినీతి- లంచగొండితనం ఏ స్థాయిలో ఉండేవి? అప్పటి కాలమానం .. సమాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితుల్ని ప్రతిబింబిస్తూ .. సంఘంలో అవినీతిపరుల్ని.. లంచగొండుల్ని అంతమొందించేందుకు శంకర్ స్టైల్ `భారతీయుడు` ఏం చేశాడన్నది చూశాం.

అయితే ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతోంది అంటే ఈ సినిమా కథాంశం ఎలా ఉండాలి. అప్పటితో పోలిస్తే ఇప్పుడు అవినీతి వందరెట్లు పెరిగిందే కానీ తగ్గలేదు. లంచగొండితనం దారుణంగా పెరిగింది. రాజకీయం వ్యాపారంగా మారింది. గోడల్లో.. బాత్రూమ్ గోడల్లో .. పరుపుకింద .. వీలున్న ప్రతిచోటా 2000 నోట్ల కట్టలు దర్శనమిస్తున్నాయి. ఓవైపు ఐటీ దాడులు … జీఎస్టీ అధికారుల సెర్చ్.. సీబీఐ ఎటాక్ లు ఎన్ని ఉన్నా అవినీతిని మాత్రం ఆపలేకపోతున్నారు. అధికారుల వేటలో రోజుకో సొరచేప చిక్కుతూనే ఉంది. మరి ఇలాంటి అవినీతి సంఘానికి సరైన ట్రీట్ మెంట్ అవసరమే కదా! అందుకే నేటి కాలమాన పరిస్థితులకు తగ్గ కథాంశంతో భారతీయుడు 2 చిత్రాన్ని కమల్ హాసన్ – శంకర్ బృందం అభిమానుల ముందుకు తేవాలని పంతంతో ఉన్నారు. ఎన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైనా శంకర్ ఎంతో పట్టుదలగా ముందుకు వెళుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ మరోసారి సాహసం చేస్తోంది. అయితే నేటి భారతీయుడి లుక్ ఎలా ఉండబోతోంది? అంటే ఇదిగో తాజాగా ఓ లుక్ రివీలైంది.

నేడు ఇండిపెండెన్స్ డే సందర్భంగా సంగీత దర్శకుడు అనిరుధ్ కమల్ హాసన్ లుక్ ని రివీల్ చేశారు. భారతీయుడు 2.0 రీబూటెడ్. ఈ కొత్త లుక్ మైండ్ బ్లోవింగ్ అనే చెప్పాలి. నాటి కాలమాన పరిస్థితులతో పోలిస్తే నేటి అవినీతిపరులు.. లంచగొండులు ప్రమాదకారులు. కళ్ల ముందే ఏమార్చేస్తున్నారు. మరి వీళ్లకు ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వబోతున్నారు? అన్నది సస్పెన్స్. రోడ్ పక్కన పబ్లిక్ టెలీఫోన్ బూత్ నుంచి ఫోన్ చేసి హెచ్చరికలు జారీ చేసిన భారతీయుడిని ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఈసారి ఇంకా మోస్ట్ పవర్ ఫుల్ విద్యలతో రాటుదేలి అవినీతిపరుల గుండెల్లో బాకు దించుతాడేమో చూడాలి.
Please Read Disclaimer