కరోనా బాధితుల కోసం ఇంటినే హాస్పిటల్ గా మార్చిన స్టార్ హీరో

0

సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎప్పుడూ ముందుండే హీరో కమల్ హాసన్. కరోనా వైరస్ దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న సమయంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ తన వంతు బాధ్యతగా ఎన్నో రకాల సహాయాలు చేస్తున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్గా మారి తాను చేపట్టే కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. తాజాగా కరోనా బాధితుల కోసం కమల్ హాసన్ చాటిన మానవత్వం అందర్నీ విశేషంగా ఆకట్టుకొంటున్నది. కమల్ హాసన్ కరోనా చికిత్స కోసం తన ఇంటిని ఆసుపత్రిగా మార్చాలనుకుంటున్నానని తెలిపారు. ఈ విషయమై ఆయన ట్వీట్ చేసారు. తన పార్టీ మక్కల్ నీది మయ్యంలోని వైద్యులతో కలిసి తన ఇంటిని హాస్పిటల్ గా మార్చాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. దీనికి ప్రభుత్వం అనుమతించాలని కోరారు.

తాజా నిర్ణయం నేపథ్యంలో కమల్ పై పలువురు ప్రశంసలు గుప్పిస్తున్నారు. కమల్ ను స్ఫూర్తిగా తీసుకొని యాక్టర్లు ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. మానవత్వం చాటిన కమల్ను మీరు చాలా గ్రేట్ సార్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కమల్ హాసన్ ప్రస్తుతం దర్శకుడు శంకర్ తెరకెక్కించే ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత భారతీయుడు సినిమాకు సీక్వెల్గా ఈ చిత్రం వస్తున్నది. ఇటీవల జరిగిన ప్రమాదం కారణంగా ఇండియన్ 2 చిత్ర షూటింగ్ ఆగిపోయంది. ఆ తర్వాత కరోనా పలు చిత్రాల షూటింగ్ లకు అడ్డు తగిలిన విషయం తెలిసిందే.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-