మహేష్ ను మెచ్చుకున్న కమల్ హాసన్

0

సూపర్ స్టార్ మహేష్ సోషల్ మీడియా లో ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడు తోటి నటీ నటుల కు అలాగే టెక్నీషియన్స్ ను విష్ చేస్తుంటాడు. ఇక ఏదైనా సినిమా చూసి అది నచ్చితే వెంటనే టీమ్ ను అభినందిస్తూ ట్వీట్స్ వేస్తుంటాడు కూడా.

ఇక నవంబర్ 7న కమల్ హాసన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన పై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. అయితే ఆ రోజు మహేష్ తెలిపిన శుభాకాంక్షలకు లేటెస్ట్ గా రిప్లై ఇచ్చాడు కమల్. మహేష్ నీ శుభాకాంక్షలు అందాయని చెప్తూ ట్వీట్ చేసాడు.

“ధన్యవాదాలు మహేష్ జి. నువ్వు కూడా కెరీర్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలు పెట్టి అద్భుతమైన నీ కెరీర్ లో గొప్ప ఎత్తుల ను అందుకుంటున్నావు. నీ శుభాకాంక్షల ను నేను గౌరవప్రదం గా స్వీకారిస్తున్నాను. విష్ యు ఆల్ ది బెస్ట్” అంటూ మహేష్ కెరీర్ పట్ల తను ఎంతో ఆనందంగా ఉన్నానని తెలిపాడు. ఇక ఈ ట్వీట్ కి మళ్లీ థాంక్స్ చెప్తూ రీ ట్వీట్ చేసుకొని మురిసి పోయాడు మహేష్ .
Please Read Disclaimer