ఖైదీ చూసి దర్శకుడిని లాక్ చేసిన విశ్వనటుడు!

0

ఖైదీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ పేరు ఇప్పుడు కోలీవుడ్ సహా టాలీవుడ్ లోనూ హాట్ టాపిక్. ఇటీవల విడుదలైన ఖైదీ రెండు భాషల్లోనూ బ్లాక్ బస్టర్ అవ్వడంతో కనకరాజ్ పేరు మార్మోగుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో నేచురల్ పంథాలో అతడు ఈ చిత్రాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు విమర్శకులు సహా కామన్ ఆడియెన్ కి నచ్చింది.

ఆ క్రమంలోనే సినీపరిశ్రమ వర్గాలతో పాటు పలువురు దర్శకుడి పనితనంపై ప్రశంసలు కురిపించారు. సూపర్ స్టార్ మహేష్- సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి ప్రముఖులు లోకేష్ పనితనాన్ని మెచ్చుకున్నారు. వీటన్నిటినీ మించి ఖైదీ ఆడియన్ మెప్పు పొందింది. దీంతో త్వరలోనే ఖైదీ-2 ని సెట్స్ పైకి తీసుకెళతామని లోకేష్ ప్రకటించారు. ప్రస్తుతం ఇలయదళపతి విజయ్ తో అతడు ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే సూర్య కూడా ఓ సినిమాకు కమిట్ అయ్యాడు.

ఈ నేపథ్యంలో ఖైదీ చూసిన అనంతరం విశ్వనటుడు కమల్ హాసన్ కూడా లోకేష్ తో ఓసినిమా చేయాలని అనుకుంటున్నారట. కమల్ తన సొంత బ్యానర్లోనే ఈచిత్రాన్ని నిర్మిచాలనుకుంటున్నారు. ఇటీవలే లోకేష్ ని పిలిపించి వీలు చూసుకుని మంచి కథ సిద్దం చేయమని చెప్పారని కోలీవుడ్ వర్గాల టాక్. ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో ఆయన గురించి చెప్పాల్సిన పనిలేదు. సీనియర్.. జూనియర్ అనే బేధం లేకుండా సినిమా నచ్చితంటే ఓపెన్ గా కాంప్లిమెంట్ ఇస్తారు. కమల్ ఇటీవల కాలంలో అలా మెచ్చిన దర్శకులు అట్లీ.. లోకేష్ కనకరాజు మాత్రమేనని కోలీవుడ్ లో వినిపిస్తోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-