పెళ్లి కాగానే కనుమరుగైన హీరోయిన్.. ఫ్యామిలీతో ఇలా!

0

వెండితెర పై అందాలు ఆరబోసే భామలు.. పెళ్లి వల్లనో.. ఆఫర్లు తగ్గిపోవడం వలన కొంతకాలానికే సినిమాలకు దూరమవుతుంటారు. అలా కెరీర్ కు కొన్నాళ్ల పాటు గ్యాప్ ఇచ్చే హీరోయిన్లు.. మళ్లీ ఎప్పుడో ఒకప్పుడు రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. టాలీవుడ్ లో చిన్న హీరోల సరసన ఈ భామ.. టాప్ హీరోల సరసన ఆఫర్లను మాత్రం దక్కించుకోలేక పోయింది. ఇక 2015 తర్వాత అవకాశాలు కూడా రాకపోవడంతో పెళ్లి చేసుకోవడం బెటరని పెద్దగా సందడి లేకుండా సెలైంట్ గా మూడు ముళ్లు వేయించుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఇక చిన్న వయసులోనే కెరీర్ కు టాటా చెప్పేసిన ఈ భామ.. మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం లేదని సినీ జనం భావించారు. దీనికి తోడు ఆమెకు పెద్దగా క్రేజ్ కూడా లేకపోవడంతో.. అమ్మడు ఫ్యామిలీ లైఫ్ కే పరిమితం కావొచ్చని అనుకున్నారు. కానీ అందరి అంచనాలకు విరుద్ధంగా మళ్లీ సినిమాల్లో యాక్ట్ చేసేందుకు రెడీ అవుతుందట.

బేసిగ్గా ముంబై బ్యూటీ అయిన కామ్నా జెట్మలానీ.. తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితమే. ప్రేమికులు సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ తర్వాత.. రణం బెండు అప్పారావు ఆర్ఎంపీ కింగ్ కత్తి కాంతారావు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. 2015లో వచ్చిన చంద్రిక అనే చిత్రంలో చివరిగా నటించింది. కన్నడం తెలుగు మలయాళంలో కూడా మెరిసింది. 2014లో సూరజ్ నాగ్ పాల్ అనే బిజినెస్ మ్యాన్ని వివాహం చేసుకున్న కామ్నా సినిమాలలో నటించేందుకు ఆసక్తి చూపలేదు. ఇక ప్రస్తుతం ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్న ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫోటోలలో భర్త సూరజ్ తో పాటు పిల్లలు కూడా ఉన్నారు. మొత్తానికి కామ్నా ఓ మంచి భార్యగా గృహిణిగా సెటిల్ అయినట్లు ఫోటోలు చూస్తే అర్ధమవుతుంది. ఇక ఐదేళ్ళ తర్వాత కామ్నా తెలుగులో ఓ లేడి ఓరియెంటెడ్ మూవీలో నటిస్తుందట. ఇది థ్రిల్లర్ చిత్రంగా ప్రేక్షకులని అలరిస్తుందని అంటున్నారు. నూతన దర్శకుడు ప్రభు దర్శకత్వంలో తెరక్కనున్న ఈ చిత్రంలో కామ్నా తల్లి పాత్రలో కనిపించనుందని సమాచారం.
Please Read Disclaimer