Templates by BIGtheme NET
Home >> Cinema News >> సుకుమార్ చేతుల మీదుగా ‘కనబడుట లేదు’ టీజర్ లాంచ్…!

సుకుమార్ చేతుల మీదుగా ‘కనబడుట లేదు’ టీజర్ లాంచ్…!


టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ రోజు సస్పెన్స్ అండ్ లవ్ థ్రిల్లర్ ‘కనబడుట లేదు’ ఫిల్మ్ టీజర్ ను విడుదల చేసారు. బాలరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సరయు తలశిల సమర్పణలో ఎస్.ఎస్. ఫిలిమ్స్ – శ్రీపాద క్రియేషన్స్ – షేడ్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి మధు పొన్నాస్ సంగీతం సమకూర్చగా సందీప్ బద్దుల సినిమాటోగ్రఫీ అందించారు. ఇదివరకే విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి.

టీజర్ విషయానికొస్తే ఒక డంపింగ్ యార్డ్ లో కనిపించిన రెండు శవాల గురించి పోలీసుల డిస్కషన్ తో టీజర్ ఆసక్తికరంగా మొదలైంది. శశిత అనే తన ఫ్రెండ్ మిస్సయ్యిందంటూ ఒక యువతి పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లయింట్ ఇవ్వడం.. ఆమెను సూర్య అతని స్నేహితులు చివరిసారిగా చూశారని చెప్పడం.. అనుమానితుడైన ఆదిత్య కూడా కనిపించకుండా పోవడం వంటి అంశాలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. వీళ్లంతా ఎలా కనిపించకుండా పోయారు? డంపింగ్ యార్డ్ లో కనిపించిన శవాలెవరివి? వీటి వెనుక ఎవరున్నారు? అనే ప్రశ్నలతో టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఇక సన్నివేశాల్లోని మూడ్ ను సంగీత దర్శకుడు మధు పొన్నాస్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఎలివేట్ చేయగా.. సందీప్ బద్దుల సినిమాటోగ్రఫీ ఇంటెన్సిటీని పెంచింది. కథను చెప్పడానికి డైరెక్టర్ ఒక భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారని టీజర్ స్పష్టంగా తెలియజేస్తోంది.

కాగా సుక్రాంత్ వీరెల్ల హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో యుగ్రామ్ శశిత కోన నీలిమ పతకంశెట్టి సౌమ్యాశెట్టి ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ రాజు ఉమామహేశ్వరరావు కిశోర్ శ్యామ్ మధు ఇతర ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ‘కనబడుట లేదు’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

https://www.youtube.com/watch?v=corQVa9Zhs8