క్షణం దర్శకుడి రిస్కీ లీల

0

మూడేళ్ళ క్రితం వచ్చిన క్షణం అడవి శేష్ కు ఎంత పెద్ద బ్రేక్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థ్రిల్లర్ జోనర్ లో ఓ సరికొత్త ప్రయోగంగా నిలిచిన ఆ మూవీ దర్శకుడు రవికాంత్ పెరేపు ఆ తర్వాత తన కొత్త సినిమా మొదలుపెట్టినట్టు ఎక్కడా న్యూస్ రాలేదు. పైకి చెప్పకపోయినా ఇతగాడు గప్ చుప్ గా తన పని పూర్తి చేసేశాడు. కృష్ణ అండ్ హిస్ లీల పేరుతో రూపొందుతున్న సినిమాలో కల్కితో పేరు తెచ్చుకున్న సిద్దు హీరోగా నటిస్తున్నాడు. సీరత్ కపూర్ హీరోయిన్.

ఇటీవలే ఆర్టికల్ 370 రద్దు తర్వాత తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న లద్దాఖ్ లో చాలా రిస్కీ పరిస్థితుల మధ్య షూటింగ్ ని ఫినిష్ చేసింది యూనిట్. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియాలో పిక్ షేర్ చేసుకున్న రవికాంత్ సముద్రపు స్థాయికి 17 వేల అడుగులకు పైనున్న ఎత్తులో షూటింగ్ చేయడం ఓ గొప్ప అనుభూతని చెప్పాడు. అక్కడున్న ప్రజలు ప్రభుత్వ అధికారులు చక్కగా సహకరించడం వల్లే ఇది సాధ్యమయ్యిందని సంతోషం వ్యక్తం చేశాడు.

అయితే ఇది ఏ జోనర్ మూవీ అనేది మాత్రం బయట పెట్టలేదు. ఫాంటసీ కావోచ్చనే టాక్ ఉంది. కృష్ణ అండ్ హిస్ లీల అన్నారు కాబట్టి నిజమయ్యే ఛాన్స్ ఉంది. క్షణంతో పాటు ఇటీవలే సూపర్ హిట్ గా నిలిచిన ఎవరుకి మ్యూజిక్ అందించిన శ్రీచరణ్ పాకాల దీనికి కూడా సంగీతం సమకూర్చాడు. విడుదల తేది తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. క్షణం లాంటి థ్రిల్లర్ తర్వాత ఇంత గ్యాప్ తీసుకుని మరీ రవికాంత్ కృష్ణ అండ్ హిస్ లీల చేస్తున్నాడు అంటే అందులో ఏదో ఒక విశేషం ఉండకపోదుPlease Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home