డబుల్ మాస్ హారర్

0

లారెన్స్ కు దర్శకుడిగా ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని తీసుకొచ్చిన కాంచన సిరీస్ లో మూడో భాగం వస్తోంది. కాంచన 3 పేరుతో సన్ పిక్చర్స్ భారీగా నిర్మించిన ఈ మూవీకి లారెన్స్ స్వీయ దర్శకత్వం వహించాడు. ఇంతకు ముందు వచ్చిన వాటికంటే ఇందులో భయానక అంశాలు కాస్త ఎక్కువ జోడించారు. ఓ బంగాళాలో దెయ్యం ఉండటం దానికో ఫ్లాష్ బ్యాక్ అందులో లారెన్స్ కీలక పాత్ర వహించడం ఇదంతా అదే ఫార్ములాలోనే సాగింది. అయితే వ్యత్యాసం మొత్తం లారెన్స్ గెటప్ లో చూపించారు.

వైట్ అండ్ వైట్ పంచె కట్టులో తెల్లని గెడ్డం జుట్టుతో ఏదో వయసు మళ్ళిన పాత్రలో కాస్త డిఫరెంట్ గా ట్రై చేసినట్టు కనిపిస్తోంది. చాలా మటుకు అంశాలు మొదటి రెండు భాగాలలో చూసినవే అనిపిస్తాయి. వేదిక హీరోయిన్ గా నటించిన కాంచన 3 లో ఓవియా కీలక పాత్ర పోషించింది. కాంచన ఫస్ట్ సిరీస్ లాగే ఇందులోనూ లారెన్స్ డ్యూయల్ రోల్ చేసినట్టు సమాచారం.

కోవై సరళ-మనోబాల-సూరి-శ్రీమాన్ తదితరులు రెగ్యులర్ గా కనిపించే వేషాల్లోనే ఉన్నారు. విలన్ గా కబీర్ కొత్త ఆకర్షణ. ఆమ్రేష్ గణేష్ సంగీతం అందించగా సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ కావడంతో నిర్మాణం కాస్త రిచ్ గా ఉంది. ఇంట్లోకి పదుల సంఖ్యలో కొమ్ములు తిరిగిన ఎద్దులు రావడం రౌడీలను గాల్లో ఎగరేసి ఒకొక్కరిని ముసలాడిగా ఉన్న లారెన్స్ చితకొట్టడం లాంటి మాస్ మసాలాలు చాలానే ఉన్నాయి. చివర్లో లారెన్స్ డైలాగ్ నేను డబుల్ మాస్ అని చెప్పించడం చూస్తే హారర్ ఏ రేంజ్ లో ఉండబోతోందో అర్థమవుతోంది.
Please Read Disclaimer