సర్ధార్జీ జయంతి రోజున గాంధీజీని విమర్శించిన కంగన

0

గత కొంతకాలంగా బాలీవుడ్ కాంట్రవర్శీ క్వీన్ కంగన దూకుడు గురించి రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. కంగన కామెంట్లు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయని.. భాజపా ఎన్డీయేకి మద్ధతుగా శివసేనను విమర్శిస్తోందని మాట్లాడుకుంటున్నారు.

తాజాగా మరోసారి కంగన సంచలన విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి. ఈసారి క్వీన్ ఏకంగా గాంధీ కుటుంబాన్ని నెహ్రూని .. జాతిపిత గాంధీజీని విమర్శించేయడం హాట్ టాపిక్ అయ్యింది. నేడు ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు సందర్భంగా కంగనా రనౌత్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. సర్ధార్ జీ ఫోటోని షేర్ చేసి దానికి “నిజమైన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా” అన్న వ్యాఖ్యను కంగన జోడించింది.

“గాంధీజీని ప్రసన్నం చేసుకోవటానికి “భారత మొదటి ప్రధాని“గా పని చేసే అవకాశం దక్కినా.. తన పదవిని తృణ ప్రాయంగా త్యాగం చేసారు సర్ధార్ పటేల్. ఎందుకంటే నెహ్రూ మంచి ఇంగ్లీష్ మాట్లాడతారని భావించినందున సర్దార్ వల్లభాయ్ పటేల్ బాధపడలేదు కానీ.. దేశం దశాబ్దాలుగా బాధపడింది. మనం సిగ్గులేకుండా మన హక్కును లాక్కోవాలి“ అంటూ తీవ్ర వ్యాఖ్యల్నే చేసింది.

“నెహ్రూ వంటి బలహీనమైన మనస్సు ఉన్న నాయకుడిని గాంధీజీ ఎంచుకున్నారు.. తనను ముందు వరుసలో ఉంచి తద్వారా దేశాన్ని నియంత్రించగలనని .. నడిపించగలనని అలా చేశారు“ అని సంచలన వ్యాఖ్యను చేసింది కంగన. అది మంచి ప్రణాళికే కానీ గాంధీని హత్య చేసిన అనంతరం దేశంలో ఏం జరిగిందో చూశారుగా.. అతి పెద్ద విపత్తు అది!! అని కాంగ్రెస్ ని తూట్లు పొడిచే వ్యాఖ్యలు చేసింది కంగన. నాడు సర్ధార్జీ నిర్ణయానికి చింతిస్తున్నా!! అంటూ కంగన ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఫిలిం కెరీర్ సంగతి చూస్తే… కంగనా రనౌత్ ‘తేజస్’ చిత్రీకరణకు రెడీ అవుతోంది. షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభమవుతుంది. ‘తలైవి’ .. ‘ధాకాడ్’ చిత్రీకరణలు సాగాల్సి ఉంది.