షాక్ కి గురి చేస్తున్న కంగన స్టేట్ మెంట్

0

ఏ విషయాన్ని అయినా కుండబద్ధలు కొడుతూ.. నిర్మొహమాటంగా ఎటాక్ చేయడం బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్టైల్. బాలీవుడ్ పెద్దల్ని.. నెప్టోయిజాన్ని తనదైన శైలిలో చెడుగుడు ఆడేసిన క్వీన్ కంగన ఎంతటి వారికైనా ఎదురెళుతోంది. సిస్టర్ రంగోలి తో కలిసి అదిరిపోయే స్టేట్ మెంట్లతో విరుచుకుపడుతోంది. ఏడాది కాలంగా ఈ స్టేట్ మెంట్ల వెల్లువ పీక్స్ కి చేరుకుంది. తాజాగా అలాంటి మరో స్టేట్ మెంట్ తో కంగన హెడ్ లైన్స్ లోకి వచ్చింది.

దిల్లీ నిర్భయ దోషులకు సంబంధించి తాజాగా కంగన షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇటీవల ఉరి కంబం ఎక్కిన ఆ నలుగురు దోషుల పేర్లతో స్మారకాలు నిర్మించాలని కోరింది. మహిళలపై అత్యాచారాలకు తెగబడే వారిని.. యాసిడ్ దాడులు చేసే మృగాళ్ళని ఈ సమాజం ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించదని ఈ స్మారకాల ద్వారా తెలియజేయాలని చెప్పింది. అయితే దోషులకు సంబంధించిన స్మారకాలు నిర్మించాలనే కామెంట్ పై ఇప్పుడంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. కంగన ఇలాంటి స్టేట్ మెంట్ ఇచ్చిందేమిటి? వాళ్లేమైనా మహానుభావులా స్మారకాలు నిర్మించేందుకు? అంటూ అవాక్కవుతున్నారు. క్వీన్ పై సోషల్ మీడియాలో రకరకాలుగా నెగటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

2012 డిసెంబర్ 16న బస్సులో కొంత మంది దుర్మార్గులు నిర్భయ పై క్రూరంగా అత్యాచారం చేసిన విషయం విదితమే. దీంతో ఆమె అక్కడిక్కడే కన్నుమూశారు. అప్పట్లో ఈ దారుణమైన ఘటన సంచలనం సృష్టించింది. దీనిపై యావత్ భారతదేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు కారణమైన దోషులను ఉరిశిక్ష వేయాలని నిరసన తెలిపిన వారిలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా ఉన్నారు. అప్పుడు ఆమె `క్వీన్` షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ దుర్ఘటనపై కంగన మాట్లాడుతూ “ఈ ఘటన జరిగినప్పుడు మా సిస్టర్ రంగోలిపై యాసిడ్ దాడి జరిగిన ఘటనే గుర్తొచ్చింది. అప్పుడు మేం చాలా బాధపడ్డాం. విచిత్రమేంటంటే దాడి చేసి వ్యక్తి బెయిల్ పై బయటకు వచ్చి దర్జాగా తిరిగాడు. దీంతో చాలా మంది ఏంటి అతన్నిఅలా వదిలేశారని ప్రశ్నించారు. కొన్నాళ్ళ పాటు ఆ వేధింపులు మమ్మల్ని తీవ్రంగా బాధపెట్టాయి. నేను నటిని కాబట్టి రంగోలికి నయం చేయించగలిగాను. ఆమె కన్ను బాగా దెబ్బతిన్నది. దీంతో రెటీనా మార్పించాను. అదే సామాన్య వ్యక్తులకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏంటి? అనుకున్నాం. ఇక నిర్భయ ఘటన సమయంలోనూ అలాంటి బాధే కలిగింది. ఆమె తల్లి న్యాయం కోసం దాదాపు ఏడేళ్లు పోరాడింది. ఈ మధ్యలో ఆమెకి ఎన్ని రకాల వేధింపులు ఎదురయ్యాయో తలుచుకుంటేనే బాధేస్తుంది. నిజం చెప్పాలంటే న్యాయం కోసం ఇంత సుదీర్ఘంగా వెయిట్ చేసి ఆమె మానసికంగా ఎప్పుడో చచ్చిపోయి ఉంటారు. మన న్యాయ వ్యవస్థ చాలా పురాతనమైనది. ఓ దుర్మార్ఘమైన ఘటనకు పాల్పడ్డ క్రూరులపై శిక్ష వేయడానికి ఇన్నేండ్లు పట్టడమే పెద్ద అన్యాయం. ఇది మారాలి. ఇలాంటి ఘటనలకు పాల్పడ్డ దోషులకు వెంటనే శిక్ష పడేలా మన చట్టాలుడాలి“ అని పేర్కొంది.

కంగన మాటల్లో ఆవేశాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన టైమ్ వచ్చిందేమో! స్మారకాలు కట్టాలి అని కోరేంత కసిని మృగాళ్లపై పెంచుకోవడం వల్లనేనేమో! తన సోదరి రంగోలికి జరిగిన అన్యాయం పురుషాధిక్య ప్రపంచంపై దండయాత్రగా మారిందని నిర్ధారణకు రావొచ్చు. దుర్మార్గులకు స్మారకం కడితే వీడు దుర్మార్గుడు అని తెలుస్తుంది కదా! అందుకే అలా కంగన వ్యంగ్యంగా కోరిందన్నమాట. ఇక కంగన కెరీర్ ని చూస్తే… ఇటీవల `పంగా` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కంగన ప్రస్తుతం తమిళనాడు మాజీ సీఎం.. దివంగత నటి జయలలిత బయోపిక్ `తలైవి`లో నటిస్తోంది. దీంతోపాటు హిందీలో `ధాకడ్` చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-