మరోసారి ఇండస్ట్రీ పెద్దలపై విరుచుకుపడిన స్టార్ హీరోయిన్…!

0

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ చేసుకొని చనిపోవడంతో ఇండస్ట్రీలో నెపోటిజం పై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. సుశాంత్ మరణానికి నెపోటిజం కూడా ఒక కారణమని పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు బహిరంగంగా వ్యాఖ్యానించారు. దీనిపై బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ కూడా స్పందించారు. వరుస వీడియోలను పోస్ట్ చేస్తూ ఇండస్ట్రీ పెద్దలపై మండిపడుతున్నారు. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడే ఈ ఫైర్ బ్రాండ్.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది ఆత్మహత్యా లేదా పక్కా పథకం ప్రకారం చేసిన హత్యా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గతంలో తనను జావేద్ అక్తర్ బెదిరించిన విషయాన్ని బయటపెట్టింది కంగనా.

‘హృతిక్ రోషన్ కు క్షమాపణ చెప్పకపోతే నువ్వు కూడా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది’ అని ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ తనను బెదిరించారని కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ”గతంలో ఒకసారి జావేద్ అక్తర్ నన్ను కలిశారు. రాకేష్ రోషన్ కుటుంబానికి చాలా పలుకుబడి ఉంది. నువ్వు హృతిక్ కు సారీ చెప్పకపోతే చాలా ఇబ్బందులు పడతావు. నిన్ను జైల్లో పెట్టిస్తారు. ఆ తర్వాత నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని నన్ను గట్టిగా బెదిరించారు” అని కంగన వెల్లడించింది. నేను వారికి క్షమాపణ చెప్పకపోతే ఎక్కడికి వెళ్ళలేనని అతను ఎందుకు అనుకున్నాడు.. హృతిక్ రోషన్ కు క్షమాపణ చెప్పకపోతే నేను ఎందుకు ఆత్మహత్య చేసుకోవలసి వస్తుందని అతను ఎందుకు భావించాడో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదని కంగన పేర్కొన్నారు.

సుశాంత్ ను కూడా ఎవరైనా పిలిచి ఇలానే బెదిరించారేమో.. సూసైడ్ చేసుకోవాలని ఆలోచనలను అతడి బుర్రలోకి పంపించారేమో నాకు తెలియదు. అతడు కూడా నాలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడేమో చెప్పలేను అని కంగనా అనుమానం వ్యక్తం చేశారు. ”నా అభిప్రాయాలను సూటిగా వ్యక్తికరిస్తాను. ఇబ్బందులను దాటుకుంటూ వచ్చాను. వాటిని అధిగమించాను. అయితే సుశాంత్ నాలా కాదు. వీటన్నింటిని తనలోనే దాచుకున్నాడు. అతడిని రాక్షసుడిగా చూపించడంలో మీడియా కూడా గణనీయమైన పాత్ర పోషించింది. సుశాంత్ ఎంత మంచివాడో.. మానవత్వం గల మనిషో అతని సన్నిహితులకు తెలుసు. ఎప్పుడో ఓ సారి ఈ విషయం గురించి మనకు తెలుస్తుంది. సుశాంత్ సినిమాలు గల్లీబాయ్ కంటే ఎక్కువ వసూలు చేశాయి. ఎమ్.ఎస్.ధోని సినిమా తర్వాత అతడి గురించి ప్రతి ఒక్కరికి తెలిసింది. కానీ గతంలో సల్మాన్ ఖాన్ లాంటి వారు సుశాంత్ ఎవరని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితులను మనం ఆపాలి” అని కంగనా కోరారు.

ఇప్పుడు తాజాగా మరో వీడియోతో ముందుకొచ్చింది కంగనా. ఈ వీడియోలో సుశాంత్ స్పిరిట్ దెబ్బతీయడానికి కొన్ని ప్రసార మాధ్యమాల్లో అతనికి నెగిటివ్ గా ప్రచురించిన ఆర్టికల్స్ చదివి వినిపించింది. ఈ ఆర్టికల్స్ తో సుశాంత్ కెరీర్ తో ఎలా ఆడుకున్నారో అని వెల్లడించింది. ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దలు ఇచ్చే డబ్బులకు అమ్ముడుపోయే పీఆర్వోల ద్వారా ఇలాంటి నెగిటివ్ ఆర్టికల్స్ ప్రచురించి పర్సనల్ టార్గెట్ చేస్తూ వారి కెరీర్ ని నాశనం చేస్తున్నారని.. పేర్లు పెట్టకుండా ఆర్టికల్స్ రాస్తూ ఆమె నేషనల్ అవార్డు విన్నర్ అని.. కర్లీ హెయిర్ ఉంటుందని ఇలా మెన్షన్ చేస్తూ లీగల్ గా వెళ్లలేని విధంగా టార్గెట్ చేస్తుంటారని.. ఇలా సిస్టమాటిక్ గా సున్నితమైన మనస్సులను విరిచేశారని విమర్శలు గుప్పించింది.
Please Read Disclaimer