ఖరీదైన బెంజ్ కంగనకేనా? అతడికి లేదా?

0

కాంట్రవర్శీ క్వీన్ కంగన – రంగోలి సిస్టర్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు. బాలీవుడ్ లో స్టార్ హీరోలు సహా కొమ్ములు తిరిగిన మొనగాళ్లకే ముచ్చెమటలు పట్టిస్తున్న ఈ సిస్టర్స్ తీరుతెన్నులు ఆల్వేస్ హాట్ టాపిక్. ఇటీవల `జడ్జిమెంటల్ హై క్యా` రిలీజ్ ముందు జర్నలిస్టులతోనూ గొడవ పెట్టుకుంది కంగన. తనలోని ఈగోయిస్టుకు భంగం కలిగించే ఎవరితో అయినా కంగన గొడవకు దిగుతోందని.. హెడ్ వెయిట్ ప్రదర్శిస్తోందని విమర్శలున్నాయి. ఇక జడ్జిమెంటల్ హై క్యా విజయం అందుకున్న తర్వాత కూడా ఆ సినిమా దర్శకుడైన ప్రకాష్ కోవెలమూడి కి ఆ క్రెడిట్ ఇచ్చేందుకు ససేమిరా అనేస్తోంది. ఇప్పటివరకూ సక్సెస్ వేదికలపై అతడు కనిపించకపోవడానికి కారణం అదేనన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ చిత్రం తొలి రెండు మూడు రోజులకే 20 కోట్ల వసూళ్లు సాధించి విజయవంతంగా రన్ అవుతోంది.

ఈ సక్సెస్ ని పురస్కరించుకుని రంగోలి తన సిస్టర్ కంగనకు ఓ ఖరీదైన కార్ ని కానుకగా ఇచ్చింది. అది కూడా స్వస్థలం `మనాలి`లో కంగన వాహనం లేక ఏమాత్రం శ్రమ పడకూడదని ఈ కానుకను ఇచ్చిందట. మనాలిలో నిర్మించిన లగ్జరీ మిరేజ్ హోమ్ లోనే ప్రస్తుతం కంగన విశ్రాంతి తీసుకుంటోంది. ఇకపై అక్కడే జయలలిత బయోపిక్ గురించిన పనులు కూడా ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో కంగనకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రంగోలి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. లగ్జరీ బంగ్లాకి తగ్గట్టే లగ్జరీ బెంజ్ జీఎల్ఈ బ్రాండ్ కార్ ని ఏర్పాటు చేసిందట. ఈ కార్ ఖరీదు ఎక్స్ షోరూమ్ 80లక్షలు. దీంతో అభిమానులు చిట్టి చెల్లెలు అంటే ఎంత ప్రేమో అంటూ నోరెళ్ల బెడుతున్నారు. అయినా తనకు హిట్టిచ్చిన దర్శకుడికి మెచ్చుకోలుగా కనీసం సిగరెట్ లైటర్ అయినా కొనివ్వని రంగోలి తన సిస్టర్ కి మాత్రం బెంజి కొనిచ్చిందేమిటో! అంటూ పంచ్ లు పడుతున్నాయి.

ఇక్కడ ఓ ఆసక్తికరమైన విషయం ఏమంటే కంగనకు శత్రువు అయిన తాప్సీకి ఇది ఫేవరెట్ కార్ అట. గత ఏడాది తాప్సీ అదే తరహా బెంజ్ కార్ కొనుక్కుంది. తనతో పాటే హ్యూమా ఖురేషి సైతం బెంజ్ ఎస్యూవీ కార్ ని కొనుక్కున్నారు. తాప్సీతో రంగోలి గొడవ నేపథ్యంలో ఏ ఉద్ధేశంతో ఇదే కార్ కొనిచ్చిందోనన్న సందేహాలు నెలకొన్నయి. ఇకపోతే.. కంగన నటిస్తున్న తదుపరి చిత్రం పంగ 2020 రిలీజ్ కి రానుంది. ఈ చిత్రంలో కబడ్డీ ప్లేయర్ గా కంగన అదరగొట్టబోతోందట. అలాగే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి.. అమ్మ జయలలిత బయోపిక్ తో సౌత్ లోనూ సెన్సేషన్స్ కి రెడీ అవుతోంది.
Please Read Disclaimer