అమ్మ బయోపిక్..లాస్ ఏంజెల్స్ లో లుక్ టెస్ట్

0

క్వీన్ కంగన రనౌత్ స్పీడ్ గురించి తెలిసిందే. ఒకేసారి రెండు భారీ చిత్రాలకు కంగన సన్నాహకాల్లో ఉంది. తొలిగా అమ్మ జయలలిత బయోపిక్ ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ.ఎల్. విజయ్ దర్శకుడిగా విష్ణు ఇందూరి- శైలేష్ ఆర్.సింగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి అనంతరం మైసూర్ లో చిత్రీకరణ ప్రారంభం కానుంది. అయితే ఈలోగానే కంగన తన శరీరభాషను మార్చుకునే ప్రయత్నాల్లో ఉంది. అలాగే జయలలిత పాత్రకు లుక్ ఎలా ఉండాలి? అన్నదానిపై తీవ్రంగానే కసరత్తు చేస్తోంది.

ఇందుకోసం ప్రస్తుతం అమెరికా లాస్ ఏంజెల్స్ కి వెళ్లిందని తెలుస్తోంది. అక్కడ ప్రముఖ హాలీవుడ్ మేకప్ మేన్ జాసన్ కొలిన్స్ సారథ్యంలో రకరకాల లుక్ టెస్టుల్లో పాల్గొననుంది. జయలలిత యుక్తవయసులో గెటప్ .. కథానాయిక అయ్యాక గెటప్.. రాజకీయ నాయకురాలిగా మారాక గెటప్.. ఇలా రకరకాల దశల్లో గెటప్స్ పై టెస్ట్ జరగనుందట. కొలిన్స్ ఇదివరకూ కెప్టెన్ మార్వల్- బ్లేడ్ రన్న 2049 చిత్రాలకు మేకప్ ని అందించారు.

తెలుగు- తమిళం- హిందీలో ఈ సినిమా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనుంది. తమిళ వెర్షన్ కి తలైవి అని తెలుగు వెర్షన్ కి జయ అని టైటిల్స్ ని ఫిక్స్ చేశారు. ఇక ఈ చిత్రంలో ఆనాటి కాలాన్ని ప్రతిబింబించేలా రెట్రో స్టయిల్ పాటను చిత్రీకరించనున్నారని.. దీని కోసం కంగన భరతనాట్యం కూడా నేర్చుకుంటుందని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటుగా పంగా- ధాకడ్ అనే రెండు చిత్రాల్లోనూ కంగన నటిస్తోంది. ధాకడ్ భారీ యాక్షన్ చిత్రం. 2020 జనవరిలో ప్రారంభం కానుంది. తాజాగా థాయ్ ల్యాండ్ లో జరిగిన మిలీనియం బ్రిలియన్స్ అవార్డ్స్ 2019 వేడుకల్లో కంగన చీరకట్టులో తళుకుబెళుకులు ప్రదర్శించింది. ఆ ఫోటోలు వెబ్ లై వైరల్ గా మారాయి. ఇదేనా జయలలిత లుక్ అంటూ క్వీన్ ని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
Please Read Disclaimer