కంగనా కొత్త ఆఫీస్.. కొత్త బ్యానర్ అదరహో!

0

బాలీవుడ్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ కు ఎంత ఫాలోయింగ్ ఉందో అంత యాంటి ఫాలోయింగ్ ఉంది. టాలెంట్ ఎంత ఉందో అంతకు మించి అన్నట్టుగా వివాదాలు ఎప్పుడూ పక్కనే ఉంటాయి. వరస విజయాలతో ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ డమ్ పీక్స్ లో ఉన్న కంగనా ఒక కొత్త స్టూడియోను ప్రారంభించింది. మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్ ను కూడా ప్రారంభించింది.

ఈ విషయాన్ని కంగన సోదరి రంగోలి చందేల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. కొత్త ఆఫీస్ ఫోటోను.. తొలి రోజు అక్కడ పూజ కార్యక్రమాలు జరుగుతున్న ఫోటోలను షేర్ చేసింది. “ఇది ముంబైలోని ఖరీదైన ఏరియా పాలి హిల్ లోని కంగన స్టూడియో. కంగన ఈ కలను పదేళ్ల క్రితం కన్నది.. ఇప్పుడు అందరూ చూస్తున్నారు. నిజాయితీగా కష్టపడుతూ ఒక వ్యక్తి ఇలా సాధించగలిగినప్పుడు ఎందుకు కొందరు జనాలు మోసాలు చేస్తూ అబద్ధాలు చెప్తూ జీవిస్తారు?” అంటూ ట్వీట్ చేసింది.

మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్ లో కంగన సినిమాలను నిర్మిస్తుందని.. దర్శకత్వం వహిస్తుందని రంగోలి వెల్లడించింది. తమ సోదరుడు అక్షత్ ఈ ప్రొడక్షన్ హౌస్ కు సంబంధించిన లీగల్..ఫైనాన్స్ డిపార్ట్ మెంట్లు చూసుకుంటాడని వెల్లడించింది. న్యూయార్క్ ఫిలిం ఎకాడమీలో అక్షత్ ఫిలిం ప్రొడక్షన్ కోర్స్ చేసినట్టు వెల్లడించింది.

ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన కంగన ఇలా స్వశక్తితో ఎదగడం.. సొంత స్టూడియో ఓనర్ కావడం అభినందించదగిన విషయాలే. కంగన కూడా 2014 లో న్యూయార్క్ ఫిలిం ఎకాడమీలో డైరెక్షన్.. స్క్రీన్ ప్లే రైటింగ్ కోర్స్ చేసింది. ఫ్యూచర్ లో డైరెక్టర్ అవుతానని గతంలోనే వెల్లడించింది. ‘మణికర్ణిక’ సినిమా నుంచి క్రిష్ బయటకు వచ్చిన తర్వాత కంగన డైరెక్టర్ గా మిగతా సినిమాను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సొంత నిర్మాణ సంస్థ కూడా ప్రారంభించింది కాబట్టి ఫ్యూచర్లో కంగన తన సత్తా చాటడం ఖాయమే.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-