చైనా వస్తువులను బహిష్కరిద్దాం : స్టార్ హీరోయిన్

0

బాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్ అంటే అందరికి ఠక్కున గుర్తొచ్చేది క్వీన్ కంగనా రనౌత్ మాత్రమే. సినిమాలతోనే కాకూండా తన వ్యాఖ్యలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా నిర్భయంగా చెప్పేస్తూ ఎవరినైనా ఎదిరిస్తూ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. ఇక కంగనా రనౌత్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ విషయాలకు సంబంధించి తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. కాగా ఇండియా బోర్డర్ గాల్వన్ వ్యాలీలో చైనా దాడిలో కల్నల్ సహా భారతీయ సైనికులు మరణించిన నేపథ్యంలో ఆమె ఓ వీడియో పోస్ట్ చేశారు.

వీర మరణం పొందిన సైనికులకు కంగన ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ఈ సందర్భంగా చైనా వస్తువులను పూర్తిగా నిషేధించాలని కంగనా రనౌత్ దేశ ప్రజలను కోరారు. ‘ఆత్మనిర్భర్’గా మారాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పొరుగుదేశం చైనా పై మనందరం కలిసి కట్టుగా ఐక్యమత్యంగా పోరాడాలంటూ కంగనా పిలుపునిచ్చారు. దేశం కోసం అమరులైన సైనికుల త్యాగాలను ఎప్పటికి మర్చిపోకూడదని.. చైనాకు వ్యతిరేకంగా పోరాడుతున్న సైనికులతో పాటు కేంద్ర ప్రభుత్వానికి ప్రజలందరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. భారత్ కు చెందిన భూభాగాన్ని చైనా ఆక్రమించడం అంటే మన శరీరంలో ఒక భాగాన్ని తీసుకోవడం లాంటిదేనని కంగనా అభిప్రాయపడ్డారు.

”మన చేతి నుంచి వేళ్లను.. భుజాల నుంచి చేతులను వేరేవాళ్లు విరిచేస్తుంటే మనకెంత నొప్పి కలుగుతుంది.. లడఖ్ ను చైనా ఆక్రమిస్తుంటే అలాంటి బాధే ఇప్పుడు మన దేశం అనుభవిస్తోంది” అని ఆమె వ్యాఖ్యానించారు. చైనాతో భారత ఆర్మీ కేంద్ర సర్కారు తలపడుతుంటే మనవంతుగా ఏమీ చేయలేమా అని ప్రశ్నించారు. చైనా వస్తువులను మనమందరం వాడడం ఆపేసి.. కేంద్ర సర్కారుకు సహకరిద్దామని కోరారు. ఆత్మనిర్భర్.. మేక్ ఇండియా విన్ అని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోని ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు.

 

View this post on Instagram

 

“We have to stand together, unite, and collectively fight this war against China!” #अब_चीनी_बंद

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on
Please Read Disclaimer