క్వీన్ పంతం నెగ్గించుకుంటుందా?

0

బాలీవుడ్ లో ఎలాంటి బ్రాగ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోయిన్ కంగన రనౌత్. నటవారస (నెప్టోయిజం) ప్రపంచానికి అతీతంగా ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగింది. అయితే కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఏదో ఒక కోణం నన్ను వంచించారు అన్నది కంగన ఆరోపణ. లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులు చేసింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా అందివచ్చిన అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవడం లేదు. ఎదుటివారు ఎంతటి వారైనా.. ఎలాంటి బెరుకు – భయం లేకుండా ఆ దాడిని సమర్థవంతంగా తిప్పికొడుతూ బాలీవుడ్లో సంచలనం సృష్టిస్తూ కొంత మందికి కొరకరాని కొయ్యగా మారింది. ఆమెని టచ్ చేయాలన్నా ఇప్పుడు బాలీవుడ్ లో చాలా మంది వామ్మోవ్ అంటూ భయపడుతున్నారు.

ముక్కుసూటిగా చేయడమే కంగనకు అలవాటు. ఏది చేసినా.. ఎలాంటి నిర్ణయమైనా ఎగ్రెస్సివ్ గా తీసుకునే కంగన తాజాగా పాపులర్ నటి.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పురుచ్చితలైవి జయలలిత బయోపిక్ లో నటిస్తోంది. తమిళ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ ఈ చిత్రాన్నితెరపైకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా చివరి దశకు చేరుకుంది. అక్టోబర్ లో షూటింగ్ మొదలు కాబోతోంది. 100 మంది డ్యాన్సర్ లు.. కంగన పాల్గొనగా రెట్రో సాంగ్ ని చిత్రీకరించాలని దర్శకుడు విజయ్ ప్లాన్ చేస్తున్నారు. తమిళ- తెలుగు- హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి తెలుగు – తమిళ భాషల్లో `తలైవి` అనే టైటిల్ ని మేకర్స్ డిసైడ్ చేశారు. అయితే అదే పేరుని హిందీ వెర్షన్ కి కూడా పెట్టాలని కంగన పట్టుబడుతోందట. కానీ మేకర్స్ మాత్రం బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకర్షించాలంటే ఆ పేరు సరిసోదని మరో పేరు పెట్టాలని భావిస్తున్నారు.

సరిగ్గా ఈ విషయంలోనే తాను చేపట్టిన కుందేటికి మూడే కాళ్లు అంటోంది కంగన. తాను సూచించిన పేరునే పెట్టాలని పంతం పట్టినట్టు తెలుస్తోంది. సినిమా ప్రారంభానికి ముందే కంగన మేకర్స్ కు కండీషన్స్ పెట్టడం ఎలాంటి వివాదాలకు దారితీస్తుందో చూడాలి అంటున్నారు బాలీవుడ్ జనాలు. ఎందరో దర్శకనిర్మాతలు- రచయితలు- నిర్మాతలకు చుక్కలు చూపించిన.. క్వీన్ ఈసారి పంతం నెగ్గించుకుంటుందా అన్నది జస్ట్ వెయిట్..
Please Read Disclaimer