అక్క కోసం అలాంటి సినిమాల్లో కూడా నటించాల్సి వచ్చింది

0

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రస్తుతం టాప్ స్టార్ హీరోయిన్ గా దూసుకు పోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరు అయిన ఈ అమ్మడు పారితోషికం విషయంలో హీరోలతో పోటీ పడుతుంది. పలువురు స్టార్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఈమె వారసత్వంగా వచ్చిన హీరోలు మరియు హీరోయిన్స్ పై ఎప్పటికప్పుడు ఈమె కామెంట్స్ చేస్తూ బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతూనే ఉంటుంది.

తాజాగా ఒక టాక్ షో లో పాల్గొన్న కంగనా తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడింది. నేను నటిగా పరిచయం అయిన సమయంలో కొన్ని చెత్త సినిమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నేను 19 ఏళ్లు ఉన్న సమయంలో హీరోయిన్ గా నటించడం మొదలు పెట్టాను. అక్క రంగోలీపై యాసిడ్ దాడి జరగడంతో ఆమె చికిత్స కోసం పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అయ్యింది. మాది మద్యతరగతి కుటుంబం. ఆమె చికిత్స కోసం డబ్బు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కొన్ని చెత్త సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి.

అక్క కోసం డబ్బు కావాలి కనుక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సినిమాలు చేసినట్లుగా చెప్పుకొచ్చింది. తాను గతంలో పలు సినిమాలు చేశాను. అందులో నా పాత్ర కేవలం స్కిన్ షోకు మాత్రమే పరిమితం అయ్యింది. అయినా కూడా నేను డబ్బు కోసం ఆ పాత్రలు చేశాను. కాని ఇప్పుడు కథలో ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో మాత్రమే నటిస్తున్నాను అంది. డబ్బు కోసం గ్లామర్ పాత్రలు చేయాల్సి వచ్చిన సమయంలో బాధపడ్డట్లుగా కంగనా చెప్పింది.
Please Read Disclaimer