జర్నలిస్ట్ కు వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరోయిన్

0

కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఎప్పటికప్పుడు ఘాటు వ్యాఖ్యలతో.. ముక్కుసూటిగా మాట్లాడే తన మాటల కారణంగా వివాదాస్పదం అయ్యే కంగనా రనౌత్ తాజాగా ఒక జర్నలిస్ట్ పై విరుచుకు పడింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొందరు మాత్రం కంగనా రనౌత్ స్వభావమే ఇది కదా అంటూ లైట్ తీసుకుంటున్నారు. మరి కొందరు మాత్రం కంగనా తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొని బయటకు వస్తున్న కంగనాను ఒక జర్నలిస్ట్ ఆమె పెట్టిన రేప్ కేసు గురించి ప్రశ్నించిన సందర్బంగా ఈ విషయాన్ని మీడియా సంచలనం చేసేందుకు ప్రయత్నించవద్దు. మీడియా హద్దుల్లో ఉండాలంటూ జర్నలిస్ట్ కు సీరియస్ స్వరంతో వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్లి పోయింది.

చాలా ఏళ్ల క్రితం బాలీవుడ్ నటుడు ఆధిత్య పంచోలి తనను వేదించాడని ఆమద్య ఒక టాక్ షోలో చెప్పుకొచ్చిన కంగనా తాజాగా అతడు రేప్ చేశాడంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేయించింది. దాంతో ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. మరో వైపు ఆధిత్య కూడా తనపై కంగనా లేనిపోని ఆరోపణలు చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పరువు నష్టం దావా వేశాడు. కంగనా మరియు ఆమె సోదరి రంగోలిపై ఆధిత్య పరువు నష్టం దావా వేయడంతో ప్రస్తుతం ఆ కేసు విచారణ జరుగుతుంది. ఇటీవలే కంగనా సిస్టర్స్ ఆ కేసు విషయంలో కోర్టుకు నేరుగా హాజరయ్యారు.