రణబీర్ 37.. ఆలియా 27.. వీళ్లా పిల్లలు?

0

దొరికిన వాళ్లను దొరకని వాళ్లను కలిపి దొరకబుచ్చుకుని వెంటాడి వేధించి తిట్లు తిట్టేయడంలో క్వీన్ కంగనను కొట్టేవాళ్లే లేరు! కంగన బాధితుల జాబితాలో చాంతాడంత లిస్టుంది. కరణ్ జోహార్ – హృతిక్ రోషన్ – రాకేష్ రోషన్ – రణబీర్ కపూర్ – అమీర్ ఖాన్ – ఆలియా భట్ – క్రిష్ .. ఇలా పెద్ద జాబితానే పోగై ఉంది. కంగన నోటి దురుసుకు బలైపోయినోళ్లే వీళ్లంతా.

మరోసారి ఓ మీడియా ఇంటర్వ్యూలో కంగన నోట సొంపైన పదజాలం వినిపించింది. కంగన ఓ మీడియా ఇంటర్వ్యూలో రకరకాల విషయాలపై ముచ్చటిస్తూ స్వేచ్ఛగా నోరు పారేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం బాలీవుడ్ హాట్ కపుల్ రణబీర్ కపూర్ – ఆలియా జంట గురించి వాడి వేడిగా చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రేమపావురాల్ని తీక్షణంగా టార్గెట్ చేసిన కంగన .. వీళ్లింకా చిన్నపిల్లలేనా? రణబీర్ 37.. ఆలియాకు 27. అయినా వీళ్లు పిల్లలేంటి? అంటూ నిలదీసింది. 27 వయసుకే మా అమ్మ అయితే ముగ్గురు పిల్లల్ని కనేసింది. అందుకే వాళ్లేమైనా ఇంకా చిన్న పిల్లలా? అంటూ తనదైన శైలిలో దునుమాడింది.

`సెక్స్ – సిగ్గు` అన్న టాపిక్ గురించి మాట్లాడుతూ.. మన నటీనటుల్ని సెక్స్ లైఫ్ గురించి మాట్లాడటానికి అయితే ఎవరూ మొహమాటపడరు. అయితే జాతీయ వ్యవహారాల గురించి మాత్రం `నా పర్సనల్ ఛాయిస్` అంటూ తప్పించుకుంటారు! అని పాయింట్ ఔట్ చేసింది. ఎవరితో ఉంటున్నామో.. పర్సనల్ లైఫ్ ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తారు. అంతేకానీ.. దేశాన్ని మాత్రం పట్టించుకోం! అని కంగన వ్యాఖ్యానించింది. హూ ఐ యామ్ ఫక్కింగ్.. హూ ఐ యామ్ నాట్ ఫక్కింగ్!! అంటూ కాస్తంత ఘాటైన పదజాలాన్నే ఈ సందర్భంగా ఉపయోగించడం సంచలనమైంది. వ్వాటీజ్ దిస్ క్వీన్.. ఏంటీ తిట్లు?
Please Read Disclaimer