మన సినిమాను రీమేక్ చేయబోతున్న కంగనా

0

ఒకప్పుడు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్.. ఉత్తరాది సినీ ప్రేక్షకులు దక్షిణాది సినిమాలంటే చిన్న చూపు చూసేవారు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. రోబో.. బాహుబలి.. కేజీఎఫ్ వంటి చిత్రాలు బాలీవుడ్ సినిమాలను మించి వసూళ్లను రాబట్టడంతో పాటు హిందీ ప్రేక్షకులకు ఈ చిత్రాలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. అక్కడ భారీ వసూళ్లను రాబట్టడంతో సౌత్ లో విడుదలవుతున్న ప్రతి సినిమాను కూడా బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ చాలా ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక సౌత్ సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అవ్వడం ఈమద్య చాలా తరుచుగా చూస్తూనే ఉన్నాం. టెంపర్.. అర్జున్ రెడ్డిలతో పాటు ఇంకా పలు సినిమాలు అక్కడ రీమేక్ అయ్యాయి మరి కొన్ని అవుతున్నాయి. ఇదే సమయంలో తమిళంలో వచ్చిన ‘ఆడై’ చిత్రంను హిందీలో రీమేక్ చేసేందుకు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ విక్రమ్ భట్ ఏర్పాట్లు చేస్తున్నాడు. అమలా పాల్ హీరోయిన్ గా నటించిన ఆడై చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. తెలుగులో ఈ చిత్రం ఆడకపోయినా తమిళంలో మాత్రం మెప్పించింది.

ఆడై చిత్రంలో అమలా పాల్ న్యూడ్ గా నటించింది. ఈ చిత్రంతో నటిగా అమలా పాల్ పది మెట్లు పైకి ఎక్కింది అంటూ విమర్శకులు ప్రశంసించారు. ఇలాంటి సినిమాను బాలీవుడ్ లో తీస్తే తప్పకుండా ఆధరిస్తారనే నమ్మకంతో విక్రమ్ భట్ ఈ రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేశాడట. కంగనా రనౌత్ కు ఈ సినిమాను చూపించి ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట.

లేడీ ఓరియంటెడ్ చిత్రాలను చేసేందుకు ఎప్పుడు సిద్దంగా ఉండే కంగనా రనౌత్ ఛాలెంజింగ్ పాత్ర కనుక తప్పకుండా హిందీ ‘ఆడై’ చిత్రానికి ఒప్పుకుంటుందని బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరి కంగనా ఈ సినిమాను ఒప్పుకుంటే న్యూడ్ గా నటించేందుకు సిద్దం అవుతుందా లేదంటే ఆ సీన్స్ ఏమైనా మార్చుతారా చూడాలి.
Please Read Disclaimer