కంగనకు తిట్లు చీవాట్లు బూతులు కానుక

0

అమ్మ జయలలిత గా నటించడం అంటే ఆషామాషీనా? తనకంటూ ఓ ఇమేజ్ ఉంది. కథానాయికగా.. నాయకురాలిగా స్టాటస్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా అసాధారణ ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా తమిళనాడు యావత్తూ అమ్మ అంటే పడి చచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. అయితే అమ్మ బయోపిక్ `తలైవి` లుక్ రాగానే ఫ్యాన్స్ ఏమన్నారు? అంటే.. హరహరా! అంటూ చెవులు మూసుకోవాల్సిందే.

ఒక్కో తంబీ ఫ్యాన్స్ ఒక్కోలా కంగన ను ఆడేసుకున్నారు. ఇది అమ్మ ఫేర్ లుక్! అని కొందరు సందేహం వ్యక్తం చేస్తే.. చాఛీ 420 లుక్ ఇదని కొందరు తిట్టేశారు. ప్రోస్థటిక్స్ మిస్ ఫైర్ అయ్యిందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. `లుకింగ్ ఫేక్` అని కొందరు.. కేజీ మేకప్ వేసుకున్న కంగన హిలేరియస్ అని మరికొందరు .. డిజాస్టర్ అంటూ ఇంకొందరు కామెంట్లు గుప్పిస్తుండడం.. వ్యంగ్యంగా ఎల్.ఓ.ఎల్ ఈమోజీల్ని షేర్ చేయడం చూస్తుంటే కంగన తో పాటు మేకప్ వేసిన పెద్దాయన.. సినిమా తీస్తున్న ఫిలిం మేకర్స్ ఇక కళ్లు చెవులు మూసుకోవాల్సిందే అన్నంతగా ఉంది పరిస్థితి.

అసలు కంగన లాగా కనిపించ లేదు.. జయలలిత లాగా కనిపించలేదు.. కొంపదీసి స్మృతి ఇరానీ కాదు కదా! అంటూ కొందరు వ్యంగ్యంగా తూట్లు పొడిచారు. బధాయి హో బాబీ! సినిమాలో స్మృతి లుక్ లా ఉందని తిట్టారు ఒకరైతే. ఇక టీజర్ చూసినా అందులో ప్రోస్థటిక్స్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించడం .. ఆ లుక్ కోసం హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ చాలానే శ్రమించాడని అర్థమైపోతుండడం చూస్తుంటే ఈ తిట్లు చీవాట్లు ఈ శనివారం రాత్రి ఆదివారం అంతా ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇప్పటికే ట్విట్టర్లు జామైపోయాయి. ఫేస్ బుక్.. ఇన్ స్టాల్లోనూ తిట్లు చీవాట్లు ప్యాక్ అయిపోయాయి. ఈ తిట్లు సెటైర్ల ప్రవాహం చూస్తుంటే తలైవికి ఉన్న ఫాలోయింగ్ ఏపాటిదో అందరికీ మరోసారి తెలిసొస్తోంది. అయినా వాళ్లు ఏమైనా సాఫ్ట్ గా ఉండే తెలుగు యూత్ అనుకున్నారా? ఎన్టీఆర్ బయోపిక్ లుక్ రాగానే ఎంత బావుందో అంటూ పొగిడేసినట్టు పొగిడేయడానికి..! పక్కా ఊర మాస్ తంబీలతోనే పెట్టుకున్నారు మరి. ఆ మాత్రం బడితె పూజ ఉంటుంది తేడా లొస్తే అని చాలా ముందే తలైవి టీమ్ కి తెలిసొచ్చిందన్న మాట.
Please Read Disclaimer