కంగన జంబో వీ-నెక్!

0

కంగనా అనే పేరు వినగానే చాలామందికి ఫైర్ బ్రాండ్ బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గుర్తొస్తుంది. కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలకు బీపీ కూడా వస్తుంది. కానీ బాలీవుడ్ లో మరో కంగన ఉంది. ఈ భామ కంగన శర్మ. మోడల్ గా సత్తా చాటుతూనే టిక్ టాక్ లో మంచి గుర్తింపు సాధించింది. అలా అని సినిమాలలో నటించలేదని అనుకోకండి. బాలీవుడ్లో ‘గ్రేట్ గ్రాండ్ మస్తి’ అనే సినిమాలో నటించింది. సోషల్ మీడియాలో హాటు ఫోటో షూట్లతో ఫిలింమేకర్ల దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు కూడా చేస్తుంటుంది.

నిన్న రాత్రి ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు “హ్యాపీ గాళ్స్ ఆర్ ఆల్వేస్ బ్యూటిఫుల్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. సంతోషంగా ఉండే అమాయిలు అందంగా ఉంటారట. నిజమే శరీరానికి డ్రెస్సులు.. ఆభరణాలు ఎన్నో వేసుకుంటూ ఉంటారు.. కానీ మొహానికి నిజమైన అభరణం కల్మషం లేని చిరునవ్వే. సంతోషంగా ఉండే వారే అలా నవ్వగలరు. ఈ ఫోటోలో అలా చిరునవ్వు రువ్వి ఊరుకోలేదు కంగన. దాంతో పాటు టన్నుల్లో గ్లామర్ వడ్డించింది. ఛోళి-లెహెంగానో లేక చీరో అర్థం కాకుండా ఉన్న డ్రెస్ లో జంబో వీ-నెక్ తో అందాల ప్రదర్శన చేస్తూ సూపర్ గా నవ్వుతోంది. ఇలాంటి ఫోటోలతో నెటిజన్లలో టెంప్ట్ రవియిజం పెరగడం ఖాయమే!

ఈ ఫోటోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. “కంగనా పేరులోనే మ్యాజిక్ ఉంది”.. “వెరీ వెరీ హాట్”.. “మమల్ని ఎందుకు చంపుతావు?”.. “అన్ని ఉంగరాలెందుకు?” అంటూ కామెంట్లు పెటారు. ఇక కంగనా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ‘బిచ్ విల్ బి బ్యాక్’ అనే వెబ్ సీరీస్ లో నటిస్తోంది. డిసెంబర్ లోనే వెబ్ సీరీస్ స్ట్రీమింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం. టైటిలే ఇంత స్పైసీగా ఉంది.. కంటెంట్ మరెంత స్పైసీ గా ఉంటుందో.
Please Read Disclaimer