మలైకా ఫోటో పై రంగోలి పైత్యం

0

చూసే దృష్టిని బట్టే అవతలి వాళ్లు కనిపిస్తుంటారు. చెడు కోణంలో చూస్తే చెడుగానే కనిపిస్తుంది ఈ లోకం. మంచి మనసుతో చూస్తే అంతా మంచే కనిపిస్తుంటుంది. బాలీవుడ్ హాట్ సెలబ్రిటీ మలైకా అరోరాఖాన్ ని క్వీన్ కంగన సోదరి రంగోలి ఏ దృష్టితో చూస్తుంది? అన్నది తనే ఓపెన్ అయిపోయింది. రంగోలి చేసిన ఓ దురుసైన కామెంట్ నెటిజనులు భగ్గుమనేలా చేసింది.

ఇంతకీ రంగోలి అంత ఆడకూడని మాట ఏం అంది? అంత చెత్త పని ఏం చేసింది? అంటే.. 46 ఏళ్ల మలైకా అరోరాఖాన్ తన కుమారుడు అర్హన్ ఖాన్ తో కలిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేసి దానికి ఆసక్తికర వ్యాఖ్యను జోడించింది. “కొడుకు తన తల్లి విషయంలో తీసుకునే జాగ్రత్త ఇదీ.. చాలా నైస్“ అంటూ ఆ ఫోటోకి వ్యాఖ్యను జోడించింది. కొడుకుపై ముద్దులు కురిపిస్తూ.. ఎంతో లాలనగా ఉన్న ఒక ఈమోజీని పోస్ట్ చేసింది.

అయితే దానికి రంగోలి పెడార్థాలు తీస్తూ ఘాటైన విమర్శ చేయడంతో అది కాస్తా నెటిజనుల్లో వైరల్ గా మారింది. ఇంతకీ రంగోలి ఆ సన్నివేశంపై ఏమని పెడార్థం తీసింది అంటే..“దిస్ ఈజ్ మోడ్రన్ ఇండియా మదర్.. వెరీ గుడ్!“ అంటూ మలైకాని అవమాన పరుస్తూ సెటైరికల్ గా థమ్సప్ ఈమోజీల్ని షేర్ చేసింది. కొడుకుతో కలిసి ఉన్న ఆ సమయంలో మలైకా ధరించిన మోడ్రన్ నైటీపై రంగోలి అలా వంకరగా సెటైర్ వేయడంతో ఒక రకంగా నెటిజనం భగ్గుమన్నారు. “ఇంతగా దారుణానికి దిగజారిపోయింది రంగోలి“ అంటూ కొందరు చెడామడా తిట్టేస్తే మరికొందరైతే .. “నీ చెత్త మాటలకు కంగన కెరీర్ నాశనం అవుతోంది!“ అంటూ తిట్టేశారు. అన్ని తిట్టు తిన్నా రంగోలి బుద్ధి ఏమైనా మారిందా? అంటే.. అస్సలు ససేమిరా! అన్నట్టే తన వాలకం ఉంది. తన కుమారుడికి తన తల్లిగారు ఓ స్వెటర్ తొడుతున్న వీడియోని రంగోలి షేర్ చేసింది. “లాస్ట్ ఆఫ్ అథెంటిక్ ఇండియన్ మదర్స్ జనరేషన్“ అంటూ వ్యాఖ్యను జోడించింది. ఒక రకంగా మలైకా సంసారి కాదు.. తన తల్లి మాత్రమే సంసారపక్షం అనే అర్థం వచ్చేలా ఘాటైన అర్థం వచ్చేలా వ్యాఖ్యానించింది. మలైకాపై ఎంతగా పాత కక్ష ఉంటే మాత్రం మరీ ఇంతగా సాధిస్తుందా రంగోలి?
Please Read Disclaimer