`జీరో సైజ్` అనుష్కలా కంగనకు బెడిసికొడితే!

0

వివాదాల క్వీన్ కంగనా రనౌత్ ఏం చేసినా సంచలనమే. ఇంతకు ముందు దర్శకుడు క్రిష్ తో వివాదం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుస వివాదాలతో కంగన పేరు మార్మోగింది. కంగన- రంగోలి సిస్టర్స్ గుస్సా గురించి నిరంతరం చర్చ సాగుతూనే ఉంది. కంగనకు అంత ఈగో పనికిరాదని బాలీవుడ్ సహా టాలీవుడ్ లోనూ విమర్శలు వెల్లువెత్తాయి. ఇంత జరిగినా కంగనా మాత్రం తన దూకుడు విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఖరాఖండిగా తేల్చేసింది. ఇంత ఫాస్ట్గా ఉండే ఈ భామలో ఎప్పటికప్పుడు కొత్త కోణం బయటపడుతూనే ఉంది. గత నెల 21న మహాశివరాత్రి రోజున వారణాసిలో మంగళ స్నానాలు చేస్తూ శివుని సమక్షంలో పూర్తి ఆధ్యాత్మిక లుక్తో దర్శనమిచ్చింది. ఎంతైనా కంగనా స్పెషల్ కదా..

తాజాగా ఆమె పురుచ్చతలైవీ జయలలిత జీవిత నేపథ్యంలో రూపొందుతున్న బయోపిక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. కంగనా తలైవిగా ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన కంగనా రనౌత్ ఫొటోలు ఒక్కొక్కటీ విడుదలవుతున్నాయి. తాజాగా విడుదలైన కొత్త లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. కంగనా సోదరి రంగోలి చందేల్ తన ట్విట్టర్లో తలైవీ సెట్లో ఉన్న కంగనా ఫొటోలను షేర్ చేయగా.. ఇవి చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్కు గురవుతున్నారు. ఎందుకంటే సన్నజాజి తీగలా ఉండే కంగనా ఒక్కసారిగా ముద్ద బంతిలా మారి లావుగా కనిపిస్తోంది. ఇదంతా ఎందుకంటే పురుచ్చతలైవీ చిత్రం కోసం ఏకంగా 20 కేజీల బరువు పెరిగిందంట. ఈ పాత్ర కోసం ఆమె చాలా శ్రద్ద తీసుకుందంట. ఆ సంగతి ఈ ఫొటోలు చూస్తుంటేనే ఆ విషయం అర్థమవుతుంది.

అయితే దాకడ్- తేజన్ చిత్రాల్లో నటించే ముందు ఈ బ్యూటీ బరువు పెరగాలని నిర్ణయం తీసుకోవడం సాహసమేనని నెటిజనులు విమర్శిస్తున్నారు. ఆ రెండు చిత్రాల షూటింగ్ లలో కంగన మరో రెండు నెలల్లో పాల్గొనబోతోందని కంగనా సోదరి రంగోలి వెల్లడించింది. మరి ఈ రెండు నెలల్లో మళ్లీ కంగన జీరో సైజ్కి రాగలదా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. అయితే కంగనా గురించి క్వీన్ పట్టుదల గురించి తెలిసిన వారు మాత్రం తను చాలా డెడికేషన్ కలిగిన వ్యక్తని అనుకున్నదేదైనా సాధించి తీరుతుందని భావిస్తున్నారు. అయితే ఇంతకుముందు సైజ్ జీరో కోసం ఇలాంటి సాహసమే చేసి అనుష్క బుక్కయిన సంగతిని కొందరు నెటిజనులు గుర్తు చేస్తున్నారు. జీరో సైజ్ కోసం బరువు తగ్గి నానా ప్రయాసలకోర్చిన అనుష్క కెరీర్ ఏమైందో తెలిసిందే. అందుకే ఇప్పుడు క్వీన్ సన్నివేశమేమిటో అన్న అనుమానం పలువురు వ్యక్తం చేస్తున్నారు. అటు జయలలిత అభిమానులుగానీ..ఇటు కంగనా ఫ్యాన్స్గానీ తలైవి చిత్రం కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-