‘తలైవి’ లుక్: ‘అమ్మ’లా కనిపించినా కానీ!

0

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథను `తలైవి` పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఏ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాత విష్ణు ఇందూరి- శైలేష్.ఆర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు తమిళ హిందీ బాషల్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది.

ఈ చిత్రంలో క్వీన్ కంగన టైటిల్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. లెజెండరీ తమిళనాడు దివంగత రాజకీయ నాయకుడు ఎం.జి.రామచంద్రన్(ఎంజీఆర్) పాత్రలో ప్రముఖ నటుడు అరవిందస్వామి నటిస్తుండగా.. దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి గా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. శనివారం తలైవి ఫస్ట్ లుక్ రిలీజైంది.

ఈ లుక్ అచ్చం అమ్మ జయలలిత నే తలపించేలా.. ఈ పాత్ర మేకవర్ కోసం కంగన చాలానే శ్రమించినట్టు అర్థమవుతోంది. ముఖ్యంగా ప్రోస్థటిక్స్ కోసం పెద్ద రిస్క్ నే చేశారని ఈ పోస్టర్ చెబుతోంది. బ్లేడ్ రన్నర్ -కెప్టెన్ మార్వెల్ లాంటి భారీ హాలీవుడ్ చిత్రాలకు పని చేసిన ప్రముఖ హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ జాసన్ కొలిన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఫస్ట్ లుక్ టీజర్ లో జయలలిత రెట్రో డేస్ గ్లింప్స్ ని పరిచయం చేయడమే గాక.. నాయకురాలిగా మారాక ముదురు ఆకుపచ్చ రంగు చీరలో ప్రజాదర్బార్ లో కనిపిస్తున్నప్పటి లుక్ ని రివీల్ చేశారు. సినిమాల్లో నటించేప్పటికి టీనేజీ దూకుడు జయలలితలో ఎలా ఉండేదో చిన్నపాటి టీజర్ గ్లింప్స్ లో చూపించారు. ఇక అమ్మ నాయకురాలు అయ్యాక ఆ రూపంలోకి ట్రాన్స్ ఫామ్ అవ్వడం అంత సులువేం కాదు. కానీ కంగన ను అలా ప్రిపేర్ చేసిన మేకప్ ఆర్టిస్టును ప్రశంసించి తీరాల్సిందే.
Please Read Disclaimer