మరో వివాదంలో రష్మిక..!

0

వివాదాలు రష్మికకు కొత్త ఏమీ కావు. తక్కువ సినిమాలతోనే అపరిమితమైన ఫేమ్ వచ్చిన ఈమెను పలు వివాదాలు వెన్నాడాయి. కన్నడలో తొలి సినిమాతోనే స్టార్ అయిన రష్మిక ఆ వెంటనే నిశ్చితార్థం కూడా చేసేసుకుంది. కొన్నాళ్ల తర్వాత అని ప్రకటించింది.

అంతలోనే తెలుగులో అవకాశాలు వచ్చాయి. అలాంటి ‘గీతగోవిందం’ సినిమాలో లిప్ లాక్ లీక్ సంచలనం రేపింది. అప్పటికే ఎంగేజ్డ్ అయిన ఆమె అలాంటి సన్నివేశాల్లో నటించడాన్ని కొంతమంది ఆక్షేపించారు.

అదే సమయంలో ఆమె ఎంగేజ్ మెంట్ రద్దు చేసుకుంటుందని ప్రచారం మొదలైంది. చివరకు ఆ ప్రచారమే నిజమైంది. తెలుగు లో ఫుల్ గా అవకాశాలు రావడంతోనే రష్మిక ఆ ఎంగేజ్ మెంట్ ను రద్దు చేసుకుందనే అభిప్రాయాలు గట్టిగా వినిపించాయి. అయితే వాటిని రష్మిక లెక్క చేయలేదు.

ఆ తర్వాత కన్నడీగులు ఆమె పై పలు ఫిర్యాదులు చేశారు. రష్మిక కన్నడ సినిమాలు ఒప్పుకోవడం లేదని తెలుగు – తమిళాల్లో ఎక్కువ పారితోషకం లభిస్తుంది కాబట్టి ఆ సినిమాలకే ఆమె ఓకే చెబుతోందని తమ సినిమాలను కాదని అంటోందని కన్నడీగులు వాపోయారు.

అయితే రష్మిక తను కన్నడ సినిమాలకూ ప్రాధాన్యతను ఇస్తున్నట్టుగా చెప్పింది. ఇక ఇటీవలే ఆమె తను కన్నడలో మాట్లాడలేకపోతున్నట్టుగా వ్యాఖ్యానించింది. దీనిపై దుమారం రేగుతోంది అక్కడ. ఆమెకు కన్నడ మాట్లాడటానికి ఏమైందని అక్కడి వారు ప్రశ్నిస్తున్నారు. తెలుగులో మాట్లాడుతుంది కానీ కన్నడలో మాట్లాడదా? అంటూ ఆమెపై ఫైర్ అయిపోతున్నారు కన్నడ భాషాభిమానులు. అయినా లీడ్ లో ఉన్న హీరోయిన్లకు ఈ రచ్చలు తప్పవేమో!
Please Read Disclaimer