ఆ స్టార్ హీరో ఎన్టీఆర్ అభిమానట!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో చాలా మంది ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు. ఇప్పుడు కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి కూడా ఎన్టీఆర్ అభిమానుల జాబితాలో చేరిపోయాడు. కన్నడ నాట మంచి ఫాలోయింగ్ ఉన్న రక్షిత్ శెట్టి త్వరలో ‘అవనే శ్రీమన్నారాయణ’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమాను తెలుగులో ‘అతడే శ్రీమన్నారాయణ’ టైటిల్ తో డబ్బింగ్ చేయబోతున్నారు.

ఇటీవల అవనే శ్రీమన్నారాయణ ప్రమోషన్ వేడుకలో పాల్గొన్న రక్షిత్ శెట్టి మాట్లాడుతూ.. తెలుగులో తనకు ఇష్టమైన నటుడు ఎన్టీఆర్ అంటూ పేర్కొన్నాడు. ఎన్టీఆర్ సినిమాలను చూసి ఇన్సిపైర్ అయ్యి సినిమాల్లోకి వచ్చినట్లుగా పేర్కొన్నాడు. సినిమాల్లో ఆయన్ను ఫాలో అయ్యేందుకు నేను ప్రయత్నిస్తానంటూ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ డాన్స్ లు మరియు నటనకు తాను అభిమానిని అంటూ రక్షిత్ చెప్పాడు.

గీత గోవిందం స్టార్ రష్మికతో ఈయన వివాహ నిశ్చితార్థం అయ్యి క్యాన్సిల్ అయ్యింది. కనుక తెలుగు ప్రేక్షకులకు కూడా రక్షిత్ శెట్టి సుపరిచితుడు అయ్యాడు. హీరోగా నటిస్తూనే దర్శకత్వం కూడా చేస్తున్న రక్షిత్ శెట్టి అతడే శ్రీమన్నారాయణతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు. మరి తెలుగులో ఈయనకు బ్రేక్ దక్కేనా తెలుగు ప్రేక్షకులు ఈయన్ను ఎలా ఆధరిస్తారు అనేది చూడాలి.
Please Read Disclaimer