యష్ బర్త్‌డే గిఫ్ట్.. అదరగొడుతున్న కేజీఎఫ్‌ 2 సెకండ్‌ లుక్‌

0

బాహుబలి తరువాత ఆ స్థాయిలో నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సౌత్ సినిమా కేజీఎఫ్‌. సాండల్‌వుడ్‌ యంగ్ హీరో యష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ఘన విజయం సాధించి కన్నడ సినిమా స్థాయిని, మార్కెట్‌ను పెంచింది.

ప్రస్తుతం ఈ సూపర్‌ హిట్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తొలి భాగం సూపర్‌ హిట్‌ కావటంతో సీక్వెల్‌ను మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో యష్‌కు ప్రతినాయకుడిగా బాలీవుడ్‌ సీనియర్‌ హీరోగా సంజయ్‌ దత్‌ నటిస్తుండటం విశేషం. ఇప్పటికే సంజయ్‌ దత్‌కు సంబంధించిన ప్రీ లుక్‌తో పాటు యష్‌ లుక్‌ను కూడా రివీల్ చేశారు చిత్రయూనిట్.

తాజాగా యష్‌ పుట్టిన రోజు సందర్భంగా కేజీఎఫ్‌ 2 సెకండ్‌ లుక్‌ రిలీజ్‌ అయ్యింది. 90ల నాటి స్టైలింగ్‌లో చేతిలో ఆయుదంతో అగ్రెసివ్‌గా కనిపిస్తున్న యష్‌ లుక్‌ సూపర్బ్ అనిపించేలా ఉంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. కొంత భాగం షూటింగ్‌ కేజీఎఫ్‌ చాప్టర్‌ 1 తెరకెక్కిస్తున్న సమయంలో పూర్తి చేశారు.

యష్‌ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో రవీనా టండన్‌, అనంత్‌ నాగ్‌, మాళవికా అవినాష్‌, అచ్యుతకుమార్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తొలి భాగానికి అద్బుతమైన పాటలతో పాటు నేపథ్య సంగీతం అందించిన రవి బసూర్‌ ఈ సినిమాకు కూడా సంగీతమందిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణతో పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2020 వేసవిలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.
Please Read Disclaimer