ఇండస్ట్రీలో మరో విషాదం.. యువ నటుడు ఆత్మహత్య

0

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపిన బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ దుర్ఘటన మరవకముందే మరో నటుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. బుల్లితెరపై క్రేజీ హీరోగా పేరు సంపాదించుకున్న సుశీల్ గౌడ(30) తన స్వగృహంలో సూసైడ్ చేసుకొని మరణించాడు. సుశీల్ మరణ వార్తతో కన్నడ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కన్నడ స్టార్ చిరంజీవి సర్జా మరణించిన విషయం ఇంకా ఎవ్వరూ మరిచిపోక ముందే మరో టాలెంటెడ్ యాక్టర్ నేలరాలడం వారిని కలచివేస్తోంది. అయితే సుశీల్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సుశీల్ మరణ వార్తపై ఆయన సన్నిహితులు అభిమానులు తోటి నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

కాగా సుశీల్ గౌడ స్వస్థలం కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య. ‘అంతపుర’ అనే సీరియల్ తో సుశీల్ గౌడ మంచి గుర్తింపు పొందారు. టీవీ నటుడిగానే కాకుండా ఫిట్నెస్ ట్రైనర్ గా చాలా మంది సెలబ్రిటీలకు హెల్త్ టిప్స్ అందించే వారు. పలు టీవీ సీరియల్స్లో నటించడమే కాకుండా దునియా విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సలాగా’ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు సుశీల్. అయితే ఆ చిత్రం రిలీజ్ కి ముందే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈయన మృతితో కన్నడ సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుశీల్ ఆత్మహత్య పాల్పడ్డాడనే వార్త అతని స్నేహితుల్లో టీవీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది. ఎంతో భవిష్యత్తు ఊహించుకున్నాడని.. అంతలోనే తనువు చాలించడం అందర్నీ బాధకు గురి చేస్తోంది. ఇక సుశీల్ ఆత్మహత్యపై దునియ విజయ్ మరియు నటి అమితా రంగనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.