నిఖిల్.. కన్నే కన్నే ట్రెండీగా ఉందే

0

నిఖిల్ సిద్ధార్థ్.. లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘అర్జున్ సురవరం’. పలు వాయిదాల తర్వాత పక్కాగా ఈనెల 29 న రిలీజ్ అవుతుందని నిఖిల్ నమ్మకంగా చెప్తున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ లో ఊపు తీసుకొస్తున్నారు. నవంబర్ 26 న ఈ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమానుండి ‘కన్నే కన్నే’ అంటూ సాగే వీడియో సాంగ్ ను విడుదల చేసింది చిత్ర బృందం.

ఈ సినిమాకు సంగీత దర్శకుడు సామ్ సి.యస్. ఈ పాటకు సాహిత్యం అందించినవారు శ్రీమణి. అనురాగ్ కులకర్ణి.. చిన్మయి ‘కన్నే కన్నే’ గాయనీ గాయకులు. “నా మనసిలా మనసిలా ఓ మనసే కోరుకుందే.. నీ మనసుకే మనసుకే ఆ వరసే చెప్పమందే ఏమో ఎలా చెప్పేయడం.. ఆ తీపిమాటే నీతో ఏమో ఎలా దాటేయడం.. ఈ తెగువే తకధిమితోం..” అంటూ మొదలయిన పాట “కన్నే కన్నే కన్నే రెప్పే వేస్తే” అంటూ హుక్ లైన్ దగ్గరకు వస్తుంది. ప్రేమలో పడిన జంట భావాలను అందమైన పదాలుగా కూర్చారు శ్రీమణి. ఇక ఈ పాటకు మెలోడీ ప్లస్ బీట్ అన్నట్టుగా ఒక ట్రెండీ ట్యూన్ అందించారు సామ్. సాంగ్ లో కొన్ని చోట్ల ఇన్ స్ట్రుమెంటేషన్ అదిరిపోయింది. అనురాగ్.. చిన్మయిల గానం కూడా బాగుంది. మధ్యలో వచ్చిన హమ్మింగ్ బిట్ కూడా సూపర్. మొదటి సారి వినగానే సూపర్ అనిపించకపోవచ్చు కానీ వినగా వినగా సంగీత ప్రియులకు నచ్చే పాట ఇది.

ఈ పాటను అజర్ బైజాన్ లాంటి సూపర్ లొకేషన్స్ లో చిత్రీకరించడంతో చూడడానికి చాలా అందంగా ఉంది. పాటలో నిఖిల్.. లావణ్య మధ్య ఉండే బీఎస్సి ఎకనమిక్స్ సమీకరణాలు అర్థం అయి అర్థం కానట్టు చాలా అందంగా ఉన్నాయి. ఎక్కువగా అర్థం కానీ ప్రేమలో ఉండే లోతైన అర్థాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా పాటను చూసేయండి..!
Please Read Disclaimer