మనమ్మాయి ఈసారి అక్కడ కొట్టేలా ఉందే

0

ఒకప్పుడు తెలుగు హీరోయిన్స్ లో ఎక్కువ శాతం మంది తెలుగు వారే ఉండే వారు. కాని ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. స్టార్ హీరోయిన్స్ అంతా కూడా వేరే భాషకు చెందిన వారు. దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్గా మాత్రం పేరు దక్కించుకోలేక పోయారు. కొందరు వచ్చినా కూడా వారికి ఆధరణ కరువు అయ్యింది. అయితే తెలుగు అమ్మాయిలు ఇతర భాషల్లో మాత్రం మంచి ప్రభావం చూపించడం జరుగుతుంది. తాజాగా రీతూ వర్మ కూడా కోలీవుడ్ లో మంచి అవకాశాలు దక్కించుకుంటుంది.

తెలుగులో పలు చిన్నా చితకా చిత్రాల్లో నటించిన రీతూ వర్మ ‘పెళ్లి చూపులు’ చిత్రంలో విజయ్ దేవరకొండతో కలిసి మంచి సక్సెస్ ను అందుకుంది. అయితే ఆ సక్సెస్ రీతూకు తెలుగులో ఆఫర్లు తెచ్చి పెట్టలేదు. దాంతో తమిళం వైపుకు వెళ్లింది. తమిళంలో ఈమెకు విక్రమ్ సరసన నటించే అవకాశం దక్కింది. ఆ చిత్రం ఇంకా విడుదల కాలేదు. మరో వైపు మలయాళం మరియు తమిళంలో మంచి స్టార్ డం ఉన్న దుల్కర్ సల్మాన్ తో తమిళ చిత్రం ‘కున్నం కన్నుం కొలైయడిత్తాల్’ చిత్రంలో నటించింది.

దుల్కర్ సల్మాన్ బర్త్ డే సందర్బంగా ఈ చిత్రం ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు మరియు మలయాళంలో కూడా ఈ చిత్రంను డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఒక విభిన్నమైన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. దుల్కర్ సల్మాన్ తో పాటు రీతూ వర్మకు కూడా ఇది ఒక మంచి చిత్రంగా నిలవడం ఖాయం అంటూ తమిళ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో ప్రత్యేకత ఏంటీ అంటే ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్న ఈ చిత్రం తప్పకుండా సక్సెస్ అవుతుందంటున్నారు. మొత్తానికి తెలుగమ్మాయి అక్కడ ఈసారి పెద్ద సక్సెస్ అందుకునేలా ఉంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home