#కపూర్ బోయ్స్ చిలిపి ముద్దుల దొంగలు

0

కపూర్ బోయ్సా మజాకానా? ప్రేమించడంలో.. ప్రేమ ముగ్గులో దించేయడంలో.. ప్రియురాళ్లను ముద్దులాడేయడంలో .. మహా ఘనాపాటీలు. చిలిపిగా బూరె బుగ్గల్ని ఆరగించమంటే వీళ్ల తర్వాతనే. ఇదిగో ఇక్కడ ఈ యవ్వారం చూసాక ఆ మాట మీరే చెబుతారు.

రణబీర్ కపూర్ తన ప్రేయసి అలియా భట్ ను ముద్దు పెట్టుకున్నాడు. అర్జున్ కపూర్ తన ప్రియురాలు మలైకా అరోరాని ముద్దాడేస్తున్నాడు. అయితే ఇది లైవ్ ఫోటో కాదు. త్రోబాక్ పిక్చర్ అని తెలుస్తోంది. మలైకా అరోరా చెంపపై అర్జున్ జస్ట్ ఒక పెక్ ఇచ్చాడు అంతే. అదంతా ప్రేమతోనే.. ఇక రణబీర్ సంగతి చెప్పాలా? ముచ్చటగా మూడో ప్రియురాలికి బుగ్గలపై ఎర్ర రంగు నిగ్గు తేలేలా ముద్దాడేస్తున్నాడు.

బాలీవుడ్ డార్లింగ్ అలియా భట్ మొన్ననే ఓ ఏడాది పెద్దదైంది. ఈ క్యూటీ పుట్టినరోజున ఇలా ముద్దాడేశాడా? అంటే కానే కాదు. ఈ త్రోబాక్ పిక్చర్ ఎక్కడిది? అంటే.. అది న్యూయార్క్లో క్లిక్ మనిపించినది అట. ఇక దీనిని ఆలియా బర్త్ డే రోజు స్నేహితులు వైరల్ చేస్తూ.. తీపి సందేశాలతో సోషల్ మీడియాను కిస్సింగ్ ఫోటోలతో నింసేసారు. ఇక కపూర్ బోయ్స్ ముద్దులాటలపై ఫ్యాన్స్ లో ఒకటే ఆసక్తికర చర్చ సాగుతోంది. రణబీర్ కపూర్ అలియా చెంపపై ముద్దు పెట్టవచ్చు. ఆ జంట త్వరలోనే పెళ్లాడుకుంటారు. అది సరే కానీ.. అర్జున్ వ్యవహారమే ఏదీ క్లారిటీగా లేదు. మలైకాను ఎప్పుడు పెళ్లాడతాడో చెప్పడు. తాము ఇలానే బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నామని కరాఖండిగా చెప్పేస్తూ ఫ్యాన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఎందుకనో!
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-