కామ్రేడ్ నిజంగా చూశారా కరణ్ సార్?

0

భారీ అంచనాలు ఓపెనింగ్స్ మధ్య విడుదలైన డియర్ కామ్రేడ్ డివైడ్ టాక్ మధ్యే సాగుతోంది. రివ్యూస్ రిపోర్ట్స్ అధిక శాతం మిశ్రమ స్పందన ఇవ్వడంతో విజయ్ దేవరకొండ ఆశించిన రిజల్ట్ అందకపోవచ్చన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దర్శకుడు భరత్ కమ్మ సెన్సిటివ్ లవ్ స్టోరీని సోషల్ మెసేజ్ తో మిక్స్ చేయడంలో తడబడటంతో ఇది కాస్తా మూడు గంటల ప్రహసనంగా మారిపోయిందన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా రిలీజ్ ఇంకో ఇరవై నాలుగు గంటల్లో ఉండగా బాలీవుడ్ దర్శకుడు కం నిర్మాత కరణ్ జోహార్ దీని హిందీ రీమేక్ వెర్షన్ ని ప్రకటించడం ఇప్పుడు మరోసారి ప్రస్తావనకు వస్తోంది. నిజంగా ఈయన గారు సినిమా చూసారా లేక కథ విని ఎగ్జైట్ అయిపోయి గొప్పగా ఏదేదో ఊహించుకుని ట్విట్టర్ లో ఫోటోలకు ఫోజులిచ్చారా అనే అనుమానం వస్తోంది

నిజానికి డియర్ కామ్రేడ్ టీమ్ ప్రమోషన్ విషయంలో ఎంత చేయాలో అంతకన్నా ఎక్కువే చేసింది. సాహో కూడా ఇంత హడావిడి చేస్తుందో లేదో చెప్పలేం. ఐదు రాష్ట్రాల్లో మ్యూజికల్ ఈవెంట్లు ప్రీ రిలీజ్ వేడుకలు లెక్కలేనన్ని ప్రెస్ మీట్లు ఇంటర్వ్యూలు మీడియాలో ప్రచారాలు మాములుగా లేదు రచ్చ. కానీ సినిమా అంచనాలు అందుకోవడంలో లెక్క తప్పేలా కనిపించడంతో కరణ్ జోహార్ సెలక్షన్ మీద అనుమానాలు తలెత్తుతున్నాయి.

హిందీ రీమేక్ అనగానే జనం గొప్పగా ఊహించుకుంటారనే అంచనానో లేక ఇంకేదైనా కారణమో తెలియదు కానీ సోషల్ మీడియాను కరణ్ జోహార్ ని టార్గెట్ చేస్తూ మిమ్స్ కూడా వచ్చేస్తున్నాయి. నిజంగా ఇంత డ్రాగ్ ఉన్న సబ్జెక్టులో అంత ఎగ్జైట్మెంట్ పెంచిన అంశాలు ఏమిటో మరోసారి ఆయనే వివరిస్తే బెటర్. అర్జున్ రెడ్డి సక్సెస్ అయ్యాక రీమేక్ చేశారు అంటే పాయింట్ ఉంది. మరి ఇప్పుడు డియర్ కామ్రేడ్ ని ఏం చేస్తారో చూడాలి
Please Read Disclaimer