పొద్దున్నే ఫోన్ చూడాలంటే వణుకుతున్న నటి

0

సినీ నటులుగా సుపరిచితులు.. సెలబ్రిటీలకు ఉండే ప్రజాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి వారికి ఉన్న ఇమేజ్ చూసి పలువురు.. తమకూ అలాంటి ఇమేజ్ ఉంటే ఎంత బాగుండని ఫీల్ అయ్యే వారుంటారు. అయితే.. ఆ గుర్తింపుతోనూ తిప్పలు తప్పవు. సెలబ్రిటీలకు ఎదురయ్యే ఇబ్బందుల గురించి తెలిస్తే.. ఇలాంటివి కూడా ఉంటాయా? అన్న సందేహం కలుగక మానదు.

తాజాగా అలాంటి విషయమే ఒకటి బయటకు వచ్చింది. సినీ నటిగా సుపరిచితురాలు.. రియల్ ప్రపంచంలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న కరాటే కల్యాణి.. తనకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి వాపోతున్నారు. ప్రొద్దున్నే మొబైల్ ఫోన్ ను ఓపెన్ చేయాలంటేనే భయపడిపోతున్నట్లుగా ఆమె చెబుతున్నారు. కొంతకాలంగా గర్తు తెలియని వ్యక్తులు తన ఫోన్ కు అసభ్య పదజాలంతో మెసేజ్ లు.. అశ్లీల వీడియోలను పంపుతూ తనను చిత్రహింసలకు గురి చేస్తున్నట్లుగా వాపోతున్నారు.

తనను ఇలా ఇబ్బంది పెట్టే వారికి దూరంగా ఉండేందుకు కొన్ని నెంబర్లను బ్లాక్ చేసినా.. వేరే నెంబర్లతో వెంటాడుతున్నట్లుగా ఆమె చెబుతున్నారు. తన ఫోటోల్ని సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసి.. దారుణమైన రీతిలో అప్ లోడ్ చేస్తున్నారని చెప్పారు. ఈ వేధింపుల పై తాజాగా ఆమె సైబర్ పోలీసుల్ని ఆశ్రయించారు. వారిపై చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. ఈ చిత్రహింసలు కారణంగా ఫొద్దున్నే ఫోన్ చూడాలంటేనే భయమేస్తుందంటున్నారు.
Please Read Disclaimer